ముత్యం తనూ!!:- డా ప్రతాప్ కౌటిళ్యా
వెతికాను- కనిపించలేదు 
తర్వాత తెలిసింది 
శ్వాస తననీ.........!?

పారుతూ కనిపించే ఎండమావి అనుకున్నాను 
కొండ పక్కన జాలువారుతున్న చెలిమెతను 

కన్నీటి బిందువుల్లో కనిపించే 
విషాద బంధువు అనుకున్నాను 
కనుపాపల్లో విరిసిన ఇంద్రధనస్సు తను!!

చందనపు వనాల్లో పూసిన 
చందమామ కోసం వెతికాను 
గంధపు పరిమళం తను!!!

నక్షత్రపు తోటల్లో మెరిసే గడ్డి పువ్వు కోసం వెతికాను 
తూర్పు దిక్కున విరిసిన తొలి పొద్దు తను!!

జ్ఞాపకాల సరస్సుల్లో ఈదుతున్న రాజహంస కోసం చూస్తున్నాను 
ఆకాశంలో తేలిపోతున్న తెల్లని మేఘం తను!!

 నిశ్శబ్దంగా పారే సెలయేరు పాదాల శబ్దం అనుకున్నాను 
ఎదురుగా ఎన్నో నదులు కలిసి గలగల పారే జలపాతం తను!!

మంచు పర్వతాల్లో పూస్తున్న కుంకుమపువ్వు అనుకున్నాను 
మహాసముద్రంలోతుల్లో దొరికే మంచి ముత్యం తను!!!

శ్రీరామనవమి శుభాకాంక్షలు. 

డా ప్రతాప్ కౌటిళ్యా 👏

కామెంట్‌లు