మా ఊరి బడి జ్ఞాపకాలు :- కె. ఉష శ్రీ - నీర్మాల- దేవరప్పుల-జనగాం
అందమైన మనబడి నేస్తమా,
ఆనందాన్ని పంచే నేస్తమా,

అంగన్వాడీ నుంచే మొదలు మన స్నేహాలు నేస్తమా,
ప్రేమానురాగాలతో పలకరించే నేస్తమా,

మిత్రులతో గొడవలు, అలకలు నేస్తమా,
ఆపదలో ఆదుకుంటూ ఉండే నేస్తమా,

మామిడి తోటలో దొంగతనం నేస్తమా,
బడికి డుమ్మ కొట్టడాలు నేస్తమా,

ఎన్ని కష్టాలు వచ్చినా నేనున్నాను అనే ధైర్యం నేస్తమా,
ఆనందం పంచే నేస్తమా,

నీడలా ఉండే నేస్తమా,
తోడుగా నిలిచే నేస్తమా,

కులం ,మతం, బేధాలు లేని నేస్తమా,
కలిసి ఉంటే కలిగే ఆనందం నేస్తమా,

ఆట పాటల కాలమంతా మరచిపోకు నేస్తమా,
మధురమైన జ్ఞాపకాలు నేస్తమా,

 గురువు కొట్టిన దెబ్బలని గుర్తుగా నువ్వు దాచుకో నేస్తమా,
తిరిగిరాని మధుర మన తీపి గుర్తులు నేస్తమా,

గురువులను ఎప్పుడు గుర్తించుకోవాలి నేస్తమా,
మనం చదివిన పాఠశాలను అప్పుడప్పుడు చూసిపో నేస్తమా,

కామెంట్‌లు