న్యాయములు -827
"ఉపాయేన హి యచ్ఛక్యం న తచ్ఛక్యం పరాక్రమైః" న్యాయము
*****
ఉపాయేన అనగా ఉపాయము చేత.హి అనగా ఇది.యచ్ఛక్యం అనగా యత్+చక్యం యత్ అనగా ఏది,ఎందుకంటే, ఎక్కడ, ఎప్పుడు, ఎలా.చక్యం అనగా ఏదైనా పనిని సమర్థవంతంగా, తెలివిగా మరియు వేగంగా చేయడం, ఏదైనా పనిని చక్కగా సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం.న అనగా కాదు.తచ్ఛక్యం అనగా తత్+చక్యం ,తత్ అనగా అది.పరాక్రమైః అనగా పరాక్రమముతో అని అర్థము.
మన పెద్దవాళ్ళు నాలుగు రకాల ఉపాయాలు ఉన్నాయని చెబుతారు.అవి 1.సామము, 2.భేదము, 3.దానము, 4.దండము. వీటికి మరో మూడు కూడా చేర్చి సప్తోపాయములు అంటారు.అవే 5 మాయ, 6.ఉపేక్ష, 7.ఇంద్ర జాలము.
"ఉపాయము చేత సాధించదగిన దానిని పరాక్రమము చూపి సాధించలేము అని అర్థము.
"ఉపాయేన హి యచ్ఛక్యం న తచ్ఛక్యం పరాక్రమైః "న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే "గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తీసుకుని పోకూడదు" అని. ఉపాయంతో లౌక్యంగా తప్పించుకొనే ప్రయత్నం చేయాలి కానీ బలాబలాలు తెలుసుకోకుండా పౌరుషం లేదా పరాక్రమము చూపితే నష్ట పోయేది తొందరపడి పరాక్రమము చూపే వ్యక్తియే.
సింహం -కుందేలు కథలో కుందేలుకు తెలుసు.తాను పరాక్రమముతో సింహం నుండి తప్పించుకోలేనని.అందుకే అది చక్కని ఉపాయం ఆలోచించి సింహానికి తానే కాకుండా అడవిలో మరో సింహం ఉందని భ్రమింపజేసి సింహం పీడ విరగడ అయ్యేలా చేస్తుంది. తనొక్కతే కాకుండా మొత్తం జంతువులను రక్షిస్తుంది..
పొట్టేలు కొండను ఢీకొఃటే గాయాలు పొట్టేలుకే గానీ కొండకు కాదు.ఏ ఉపాయం ఆలోచించకుండా పొట్ఠేలులా తిరగబడితే ,పోరుషం చూపడం వల్ల పొట్టేలుకే నష్టం వాటిల్లింది.కాబట్టి ఉపాయంతో సాధించాల్సిన పనిని పరాక్రమముతో సాధించే సాహసం చేయకూడదు అనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడింది.
ఇలాంటిదే మరొక కథ "కాకి- పాము కథ" చెట్టుపైన కాకి గూట్లో గుడ్లు పెట్టుకుంటుంది.చెట్టుకింద పుట్టలో ఉన్న పాము కాకి మేతకు పోగానే గూటిలోకి పాకి గుడ్లను తినేస్తుంది.అది గమనించిన కాకి తాను ఎలాగూ పౌరుషంతో పామును గెలవలేదు అందుకే ఓ ఉపాయం ఆలోచిస్తుంది ఆ చెట్టుకు దగ్గరలో ఉన్న సరస్సుకు రాజ కుమార్తె చెలికత్తెలు స్నానానికి వస్తారు. వారి నగలు వస్త్రాలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తూ ఉంటారు.అది పరిశీలించిన కాకి వాళ్ళు చూసే విధంగా ఓ బంగారు నగను ముక్కున కరుచుకుని వాళ్ళు చూస్తూ వుండగానే పుట్టలో జార విడుస్తుంది. రాజ భటులు వచ్చి పుట్టను పలుగులతో తవ్వడంతో అందులోని పాముకు దెబ్బలు తాకి చనిపోతుంది. అలా కాకి ఉపాయంతో పాము పీడ విరగడ అయ్యేలా చేస్తుంది.
ఇలా మహాభారతంలో ద్రౌపది కీచకుని నుండి ఎలా ఉపాయంతో తప్పించుకుంటుందో మనకు తెలుసు. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏదైనా సమస్య వస్తే ఉపాయంతో ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి కానీ సమస్య సృష్టించిన వ్యక్తులపై కోపంతో పౌరుషానికి పోతే ..అలా పోయిన వ్యక్తికే లేనిపోని అనారోగ్యాలు కలుగుతాయి అందుకే మన పెద్దలు "ఉపాయం లేని వాడిని ఊర్లోంచి వెళ్ళగొట్టాలి "అనే మాట కూడా అంటూ ఉంటారు.
కాబట్టి ఉపాయం ఉండాలి.పంతాలు పట్టింపులు పౌరుషాలకు పోతే జరిగేది నష్టమే.అందుకే ఈ న్యాయమును గమనంలో పెట్టుకొని అపాయాల బారిన పడకుండా ఉపాయంతో బయటపడాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి