అణువణువున కనపడే
అవని అందచందాలు
అపురూపమే అనిపించు
ఆస్వాదించు హృదయాలకు!
ఆకసాన తిరిగే మబ్బులకు
అద్దమైన జలరాశి
ఆవిరై అంతలోనే నింగిచేరి
అల్లరేదో చేసేయాలని ఆత్రం!
ముసుగులేని మమకారాలే
మరపురాని అనుబంధాలు
విసుగు పుట్టని వేడుకల్లె
నిలిచిపోయే సంతోషాలు!
పెంచుకుంటే పెరిగేవే
పంతమైనా ప్రేమయినా
తుంచుకుంటే సుఖముంటే
తెంచుకోవడమే మేలు!
ఆచి తూచి వేసే అడుగులే
ఆలస్యమైనా కూడా
అలసట అనిపించనీక
ఆవలి ఒడ్డును చేరుకోగలవు
మార్పులోనే మనుగడలన్ని
మనగలవేమో హాయిగా
మంచి తెచ్చే మలుపు
మోదమేగా జీవితాలకు!
రేపటి తాయిలమేదో
వేచి చూద్దాం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి