రాజయ్య ఒక కిరాణా షాపుకు వచ్చాడు. కావలసిన వస్తువులు తీసుకున్నాడు. మొత్తం బిల్ ఎంత అయ్యిందో అడిగాడు. 720 రూపాయలు అని చెప్పాడు షాపు యజమాని ఈశ్వరయ్య. 500కు తగ్గించు' అన్నాడు రాజయ్య. "మరీ అంత తేడానా? నాకు బాగా నష్టం వస్తది." అన్నాడు ఈశ్వరయ్య. "చిన్ననాటి క్లాసుమేట్సుము. నీ ఫ్రెండు దగ్గర ఎక్కువ టీసుకుంటావా? నీ కోసం ఇంకో 50 రూపాయలు కలుపుతా." అంటూ 550 రూపాయలు చేతిలో పెట్టాడు. ఇదంతా గమనిస్తున్నాడు సతీశ్.
సతీశ్ ఒకరోజు తన స్నేహితులు అందరినీ తీసుకొని ఆ షాపుకు వచ్చాడు. తాను దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి, ఆ షాపులో స్నేహితులకు కావలసినవి అన్నీ కొని ఇచ్చాడు. మొత్తం బిల్ ఎంత అయ్యిందో అడిగాడు. 750 రూపాయలు అన్నాడు ఈశ్వరయ్య. సతీశ్ 1000 రూపాయలు ఇచ్చాడు. 250 రూపాయలు చిల్లర ఇవ్వబోయాడు ఈశ్వరయ్య. "ఏమీ వద్దు అంకుల్. నా పుట్టినరోజు గిఫ్ట్ అనుకోని ఉంచుకోండి. అలా అయితేనే రెగ్యులర్ గా నేను, మా ఫ్రెండ్స్ నీ షాపుకే వస్తాం." అన్నాడు సతీశ్. ఈశ్వరయ్య మారు మాట్లాడకుండా తీసుకున్నాడు. స్నేహితులు అంటే మన వల్ల స్నేహితులకు లాభం జరగాలని కోరుకోవాలి కానీ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని, స్నేహితులకు నష్టం చేయవద్దు అని సతీశ్ అభిప్రాయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి