10వ తరగతిలో విజయ, కల్పన తెలివైన విద్యార్థులు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ పోటీ పడి క్లాస్ ఫస్ట్ వచ్చేవారు. కానీ ఇద్దరి మధ్యా మాటలు లేవు. ఈర్ష్య మంచిది కాదు అని ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు ఎంత మంది చెప్పినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ఉండేది. ప్రధాన కారణం ఇద్దరిలో ఎవరో ఒక్కరే. ఆ ఒకరు ఎవరో చెప్పడం కష్టం.
కల్పన పుట్టిన రోజు నాడు తరగతి విద్యార్థుల అందరినీ పిలిచి, పార్టీ ఇచ్చింది. ఒక్క విజయను మాత్రం పిలవలేదు. కొంతమంది విద్యార్థులు బాధ పడ్డారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయి. శ్రావణి టీచర్ 10వ తరగతి విద్యార్థులను అందరినీ పిలిచి, కమ్మని భోజనంతో విందు ఇచ్చింది. విజయ, కల్పనలతో సహా అందరినీ పిలిచింది. తృప్తి తీరా తిన్నారు. ఆ తర్వాత ఆ విద్యార్థులకు మంచి విలువైన విషయాలను చెప్పి, పంపించింది.
మరునాడు పాఠశాలకు వచ్చిన తర్వాత శ్రావణి టీచర్ తన పీరియడులో క్లాసుకు వచ్చింది. విద్యార్థులు అందరూ టీచరుకు కృతఙ్ఞతలు చెప్పుకున్నారు. "మీరంతా కృతఙ్ఞతలు చెప్పుకోవాల్సింది విజయకు. నిజానికి నిన్న విజయ పుట్టినరోజు. అందరు మిత్రులు తన ప్రాణ స్నేహితులే. అందరికీ తన పుట్టిన రోజున పార్టీ ఇవ్వాలని విజయ ఆశ. ఈ విషయం చెపితే కొంతమంది పాల్గొనరని చెప్పనివ్వ లేదు. అందరూ విజయకు థాంక్స్ చెప్పండి." అన్నది శ్రావణి టీచర్. కల్పన ఆలోచనలో పడింది. వెంటనే వచ్చి విజయను దగ్గరకు తీసుకొని ఏడ్చింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి