.రామారావు ఎటూ తోచని పరిస్థితిలో అయోమయ స్థితిలో అలాగే కుర్చీలో కూర్చుండిపోయాడు
"ఇప్పుడు నేను ఏం చేయాలి? నా బిడ్డ బతుకు బాగుపడాలంటే నేనేం చేయాలి"అనుకుంటూ తల పట్టుకొని లోలోపలనే ఏడ్చుకొంటూ కూర్చోనిఉన్న రామారావు ను చూచిన పక్కింటి ప్రసాదరావు తిన్నగా రామారావు దగ్గరికి వచ్చి,
రామారావు పక్కనే కూర్చుని,
"చూడండి రామారావు
గారూ! మీరు ముందు కొంచెం శాంతించండి.
ఇప్పుడు జరగాల్సిన పనేందో చూడండి.
పిల్లల్ని పెద్దలు చేయడంతో పాటు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగా ఎదగాలని తల్లిదండ్రి కోరుకుంటారు.
"ఈనాటి సంఘం ఎలా ఉందంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు
ఈనాటి యువత ప్రపంచ పోకడల మత్తులో పడి చిత్తుగా చితికి పోతున్నారు. ఇప్పటి మన దేశపు పరిస్థితి, తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే, మన దేశ సాంప్రదాయాలను వదులుకోలేక, విదేశీ యుల నుండి అందుకునేఅవసరాలను కాదనలేక నడుమ నలిగిపోతున్నారు. మీరు ముందు లేవండి మనం వెళ్ళి
హాస్పిటల్ లో ఉన్న బాబుని చూద్దాం"అన్నాడు ప్రసాదరావు గారు.
రామారావు గారు కళ్ళు
తుడుచుకొని బయలుదేరాడు.
ఇద్దరు హాస్పటల్ చేరుకున్నారు.
హాస్పిటల్ రూమ్ లో మంచం మీద నీరసిం చిపోయిన శరీరంతో మూలుగుతూ పడుకుని ఉన్నాడు నరేంద్ర. కొడుకుని చూడగానే
రామారావు గుండె తరుక్కపోయింది.
"బాబు నరేంద్ర ఏందిరా ఈ స్థితి" అంటూ కొడుకుని నిలువెల్లా తరిమికున్నాడు.
"నాన్న నన్ను చనిపో నివ్వండి.
నన్ను నమ్ముకున్న నా తండ్రికి, నా దేశానికి అన్యాయం చేసిన నాలాంటి వాళ్ళు బ్రతకకూడదు.
కొండంత ఆశతో మీరు మీ ఆస్తిపాస్తులు కూడా కరిగించుకొని నన్ను పై చదువులకు అమెరికా పంపించారు. నా కర్తవ్యాన్ని మీ ఆశయాన్ని రెండిటిని నా తాగుడుకు విలాసాలకు ధారబోసి ఇలా తయారయ్యాను.
ఒక్కటి మాత్రం నిజం నాన్న. మనిషికి కష్టం సుఖం ,దుఖం సంతోషం రెండు ఒక నాణానికి రెండు ప్రక్కల ఉండే బొమ్మ బొరుసు లాంటివి .
మా కాలంలో ఏదో సుఖపడిపోతున్నామని, ఆధునిక కాలపు వసతులు పద్ధతులు చాలా మంచి వని, మన భారతదేశం కూడా ఊహిస్తున్నది.
కానీ వాటి వెనుక ఉన్న భయంకరమైన బలహీనతలు, బ్రతుకులను పట్టి చితక గోట్టే
ఒక కొత్త సమాజం ఏర్పడి అటు యువతను ఇటు పెద్దవాళ్ళ జీవితాలను కూడా బాధల గోతిలో పడేస్తున్నదని ముఖ్యంగా యువత తెలుసుకోలేకపోతున్నాం నాన్న! అమెరికాలో ఉన్న నేనే కాదు ఈ దేశంలో చదువుల సాకుతో
జల్సా చేస్తూ చివరికి
ఇదిగో నాలాగే నా పక్కన వచ్చి పడుకోనీ ఉన్నాడు చూడు." అంటూ తండ్రికి తన పక్కనే మంచం మీద ఉన్న ఒక యువకుల్ని చూపించిన సురేంద్ర
మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు
"మనుషులను మద్యం మత్తులో పడేసి ఆ ఆదాయంతో దేశాన్ని అభివృద్ధి చేయాలనుకునే ప్రభుత్వాలు ఉన్నన్నాళ్లు అందరిగతి అధోగతే.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే జ్ఞానోదయం అయిన వాళ్లు మీలాంటి అమాయకులకు చెప్పకపోతే రేపు నా తమ్ముడిని కూడా ఇలాగే మీరు కోల్పోతారు. అందుకే వాడికి మీ దగ్గరనే ఉంచుకొని చక్కటి జీవితాన్ని ఇవ్వండి అంటూ నరేంద్ర తిన్నగా దీర్ఘ నిద్రలోకి జారుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి