టైటాన్ ఆరుమ్ పుష్పం..:- తాటి కోల పద్మావతి

 ప్రపంచంలోనే అతి భారీ పుష్పం ఇప్పుడు సిడ్నీలోని రామల్ బొటానిక్ గార్డెన్లో పూసింది. తన గాడమైన దుర్గంధంతో అందరి ముగ్గులు మూసేస్తోంది టైటాన్ఆరుమ్ పేరున్న ఈ పువ్వు అసలు ఊరు ఇండోనేషియా'అమోర్ఫో పాలస్ 'అనేది దీని వృక్షశాస్త్ర సాంకేతిక నామం మూడు మీటర్లంట పెద్దగా పువ్వు పూస్తుంది. మధ్యలో పెద్ద అరటిపండును పోలిన కేసరాలు కనిపిస్తాయి. అందుకే దీనికి పేరు పెట్టారు. కుళ్ళిన మాంసం వాసన వెదజల్లే ఈ అపురూప పుష్పాన్ని చూడటానికి ఎందరో సందర్శకులు వస్తారని బొటానిక్ గార్డెన్ ప్రతినిధి డాక్టర్ టీం ఎన్ టైల్ చెప్పారు. ఇలాంటి పువ్వు రెండేళ్ల క్రితం కూచిందని అప్పుడది అంతగా దుర్గంధం వెదజల్ల లేదన్న దొక్కటే ఫిర్యాదు అని టీం చెప్పారు. 
ఈ ఏడాది ఉష్ణోగ్రత హెచ్చుగానే ఉన్నందువల్ల ఈ పువ్వు మొగ్గ తొందరగా విచ్చుకోవడం మొదలెట్టిందని అన్నారు. కొత్త వింత, పాత రోత అన్నట్లు అంతా దుర్గంధాన్ని భరిస్తూ ఇప్పటికీ ఈ పువ్వుని చూడడానికి జనం బారులు తీస్తూ పోతున్నారు. 

కామెంట్‌లు