అభిమానం!!!:- డా ప్రతాప్ కౌటిళ్యా
స్నేహమంటే జన్మ హక్కా!!?
స్నేహానికి 
రిజిస్ట్రేషన్ ఉంటుందా!!!?
స్నేహానికి 
వారసత్వం ఉంటుందా!!!??

ఒక స్నేహితుడు చనిపోతే 
ఇక స్నేహితులే ఉండరా!!?

ఒక స్నేహితుడు విడిపోతే 
మరో స్నేహితుడే లేడా!!!?

ఎడారిలో సైతం ఒయాసిస్సు ఉంటుంది 
బండ బారిన గుండెలో సైతం కోవెల ఉంటుంది 

తడారిన గొంతులో సైతం ఆర్ధత ఉంటుంది 
ఎండిపోయిన మొద్దులో సైతంఒక మొలక ఉంటుంది.

ఎండమావిలో సైతం మొండి వాన ఉంటుంది.

స్నేహమంటే గతం కాదు!
స్నేహమంటే భవిష్యత్తు కాదు!!
స్నేహమంటే కేవలం వర్తమానం !
స్నేహమంటే అభిమానం!!

డా ప్రతాప్ కౌటిళ్యా 👏

కామెంట్‌లు