యుగంధర్:- ఎం. వి. ఉమాదేవి
యుగంధర్ శిష్యుడు

 నిన్ను తలిచే నేను ఈ వృత్తి ఎంచుకున్నా డిటెక్టివ్ యుగంధర్ గారూ! ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న కారణంగా మిమ్మల్ని మరో సారి తల్చుకున్న అనుకుంటూ కేస్ స్టడీ మొదలెట్టా.
  ఎక్కడ నుండో 'అసలే చలికాలం ముసిరే సాయంత్రం 'పాట వినిపిస్తూ ఉంది. 
నిన్న కొంత మంది యువతీ యువకులు డబ్బు కోసం పిల్లల్ని కిడ్నాప్ చేసిన వైనం పేపర్లో పడింది. 
వేడెక్కిన హిమాలయాలు లా అపార్ట్ మెంట్లు ఎత్తుగా నిలబడి చోద్యం చూస్తున్నాయి. నిన్న స్కూల్ కెళ్ళిన పిల్లల్లో ఒక పాప తిరిగి రాలేదని తెలుస్తోంది. పేరెంట్స్ అగ్గగ్గ లాడి ఏడుస్తూ ఉంటే శిలలా ఏమి జరిగింది అని అడుగుతాడు నిదానంగా పోలీసు అధికారి. వాళ్ళ హయాం లో ఇలాంటివెన్ని చూసారో పాపం! నిజంగా పోలీస్ వృత్తి చాలా కష్టం. తింటున్న అన్నం వదిలేసి పోవాల్సిన పరిస్థితి. పోస్ట్ మార్టాలతో జీవితం కలత చెంది ఉంటూ!

ఏ సీ కారులో ప్రయాణిస్తున్న పుడు కూడా ఎడారి నడకే అనిపిస్తుంది. 
నీకోసం  వెతకాలి పాపా! నా కైతే  పరిశోధన గదే ప్రేమ మందిరం మరీ!
 
పాప రోజూ ఒకే టైంలో వస్తోంది కాదా అని ప్రశ్నించా. "లేదు సారు. కాస్త ఆలస్యంగా రావడం జరుగతుంది మొన్న రెండో తేదీ శుక్ర వారం కూడా" అని చెప్పేడు. అంటే ఆ పిల్ల తప్పే అవుతుంది కదా అని కేసు తప్పు దారి పట్టిస్తూ.
 
అంతలో ట్యాంక్ బండ్ మీద ఒక పెద్దాయనతో స్కూల్ యూనిఫాం లో చిన్న పాపని చూసా అని నా అసిస్టెంట్ సారథి కాల్ చేసి చెప్పేడు. వెంటనే వెళ్ళి చూసా.ఎస్ ఆ పాపే. చేతిని చూస్తే నరం మీద బ్యాండ్ అతికి ఉంది. బ్లడ్ తీసుకున్నట్టు తెలుస్తోంది . దారుణం చిన్న పిల్లలనీ ఇలా బ్లడ్ తీసుకొని వదిలేశారు.
 వాచ్ మేన్ అబద్ధం చెప్పేడు అని అర్థమై పోతుంది.
కాలెండర్ సెర్చ్ చేస్తే ఆరోజు   అతను చెప్పిన వారం కాదు. చిన్న విషయానికి అబద్ధం ఆడాడా ? యెందుకు? లేక పోతే మరిచి పోయాడేమో! వాడి వెనక ఎవరున్నారో!? బ్లడ్ గ్రూప్స్ చూడటానికి  సాకు పెట్టీ  ఆ ఏరియా లో హాస్పిటల్ ల కెళ్తున్నాను.
 క్లాక్ టవర్  డింగ్ డాంగ్ మంటుంది. నా పరిశోధన ఫలం విజయం సాధించడంతోనేనా!?
(సమాప్తం)
కామెంట్‌లు