జీవితం...సమయంమనిషికి గొప్ప గురువులు...సమయాన్నిఎలా సద్వినియోగం చేసుకోవాలోజీవితం తెలియజేస్తుందిజీవితం ఎంత విలువైందోసమయం చెబుతుందిఅమ్మ జీవితం...నాన్న సమయం...అమ్మానాన్నలు కూడామనకు గొప్ప గురువులే...జీవితంలోతారసపడే పదిమందికి"స్వచ్చమైన ప్రేమని"ఎలా పంచాలో "అమ్మ" చెబుతుందిజీవితంలోఎదురయ్యే సవాళ్లనుసాహసంతో ఎలా ఎదుర్కోవాలో...ఎవరికి తలవంచకతలదించక తలఎత్తుకొనిఆత్మ గౌరవంతో ఎలా బ్రతకాలో...నిప్పులా మండుతూనీతిగా నిజాయితీగామచ్చలేని వ్యక్తిత్వంతోధైర్యంగా ఎలా ముందుకు సాగాలో...శ్రమించి విజయాల్ని ఎలా సాధించాలోవిజేతగా విశ్వవిజేతగా ఎలా నిలవాలో...హాయిగా ప్రశాంతంగా ఆనందంగాఎలా జీవించాలో "నాన్న" చెబుతారుజీవితంలోఅమ్మా నాన్నలుచెప్పిన మాటలుగుండెల్లో మ్రోగే గుడిగంటలు...పంచిన ప్రేమలుపొలంలో పాండే పచ్చని పంటలు...అమ్మ ఒక దేవత...నాన్న ఒక దైవం...అమ్మానాన్నలు మనకు ప్రత్యక్ష దైవాలు.సేవించి పూజించాలి ప్రతినిత్యం...అదే శక్తి అదే భక్తి ఆనాడే ముక్తి...ఇది నిత్య సత్యం...ఆశల ఆణిముత్యంఇది నమ్మలేని ఒక నగ్నసత్యం...
అమ్మ జీవితం...నాన్న సమయం...: -..:- కవిరత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి