ఇది ఒక అద్భుతమైన వృక్షంగా మంగోలియా దేశ ప్రజలు ఆరాధిస్తారు. ఈ వృక్షం గట్టిగా ఉండి వర్షాకాలంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత కు పడిపోయి, వేసవిలో 40 డిగ్రీల వేడిమికి పెరుగుతుంది. ఇవి ఎక్కువ గోబీ ఎడారిలో ఉన్నాయి. దీనిలో భిన్న రకాలు ఉష్ణోగ్రతకు తట్టుకొని ఈ వృక్షాలు 40 మీటర్లు ఎత్తు వరకు ఎదగ గలవు. ఎడారి ఇసుక తిన్నెల లో వదలు పొదలుగా పెరగగలవు. వీటి బలిష్టమైన వేరులు నీటిని భూమిలో నుంచి తీర్చుకొని భద్రపరచి, మూలము కొమ్మలు వాడుకోవడానికి అందిస్తాయి.
ఇవి'5'దళాల గల పుష్పాలుగా గుత్తులుగా పూస్తాయి. ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. విత్తనాలు రెక్కల ఆకారంలో ఉండి గాలిలో దూర దూర ప్రాంతాలకు ఎగరతాయి. ప్రస్తుతం ఈ వృక్షాలు కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. వీటి పొదలలో అనేక రకాల జంతువులు, నల్లని తోకలు గల జింకలు, మజాలయి అనే పేరు గల ఒక విధమైన గోబీ ఎడారి ఎలుగుబంట్లు, సాలె పురుగులు, బల్లులు, పాములు ఒదిగి ఉంటాయి. ఇవి అరుదైన ఆకులు లేని వృక్షజాతికి చెందిన చెట్లుగా చెప్పబడుతున్నది.
సాక్సాల్ వృక్షం. :- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి