బీహార్ రాష్ట్రంలోని'ఊరిళా'అనే గ్రామంలో ఉన్న ఈ మహా భోధి వృక్షం క్రిందనే మహామాయ, శుద్ధోధనుల కుమారుడైన సిద్ధార్థుడు ఆరు సంవత్సరాలపాటు కఠోరంగా ధ్యానం చేశాడు. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడ ఆయనకు జ్ఞానోదయం అయింది. అనంతరం బుద్ధునిగా మారి ప్రపంచానికే ఆదర్శప్రాయుడైనాడు. ఈ వృక్ష పవిత్రత కారణంగా బోధిగయ అనే పేరు ఏర్పడింది. ఇప్పుడు ఈ వృక్షానికి పూజలు జరుగుతున్నవి అనునిత్యం సందర్శకులు, బౌద్ధ బిక్షువులు ఈ చెట్టుకు ప్రదక్షిణాలు చేసి పూలమాలలతో అలంకరిస్తారు.
చెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద కొవ్వొత్తులు వెలిగిస్తూ అక్కడే కూర్చుని ధ్యానం కూడా చేస్తారు.
మహా భోధి వృక్షం. ;- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి