కవ్వింపును
కల్పనను
కాంతిపుంజమును
కవిత్వమును నేను
అక్షరాలల్లికను
పదాలపొసగును
అర్ధవ్యక్తీకరణను
కవనమును నేను
ఆలోచనలను
భావాలను
విషయాలను
కవితమును నేను
పద్యమును
పాటను
వచనకైతను
వివిధసాహిత్యరూపాలను నేను
అందమును
ఆనందమును
ఊహలడోలికను
కయితమును నేను
పల్లవిని
చరణాలని
గళాన్ని
గీతికను నేను
చందస్సును
గణములను
గురులఘువులను
పద్యమును నేను
భావుకతను
ప్రబోధమును
ప్రణయమును
వచనకయితను నేను
హృదిపొంగును
గుండెగుబులును
మదిముచ్చటను
అక్షరకూర్పును నేను
కోకిలకంఠమును
పువ్వులపొంకమును
పరిమళగంధమును
సాహిత్యమును నేను
ఆస్వాదిస్తారా
అనుభవిస్తారా
అర్ధంచేసుకుంటారా
సాహితీప్రియులవుతారా
చెంతకురమ్మంటారా
సొబగులుచూపమంటారా
చిరునవ్వులుచిందించమంటారా
చిత్తాలనుదోచుకోమంటారా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి