ఆర్సీ కృష్ణ స్వామి రాజు రచించిన ‘మేకల బండ’ నవలకు గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం లభించింది. ఈ నెలాఖరున
నెల్లూరులో జరుగబోయే కార్యక్రమంలో ఆయనకు సన్మానంతో పాటు ఐదువేల రూపాయల నగదు, జ్ఞాపిక అందజేయనున్నట్లు
నిర్వాహకురాలు గోవిందరాజు సుభద్రాదేవి తెలిపారు.
తిరుపతికి చెందిన కృష్ణస్వామి రాజు ఇప్పటికే ఆరువందల పై చిలుకు కథలు వ్రాశారు. 18 పుస్తకాలు ప్రచురించారు. ఆయనవి రెండు
పుస్తకాలు కన్నడంలోకి కూడా అనువదింపబడ్డాయి.
ఆయనకి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, అంపశయ్య నవీన్ లిటరరీ పురస్కారం, తానా బాల నవలా పురస్కారం లభించి
ఉన్నాయి. ఆయన రచనలపై ఇప్పటికే రెండు ఎం.ఫిల్ డిగ్రీలు పూర్తి అయ్యాయి.
మూగ జీవాలకు మానవుల్లాగా ఆలోచించే శక్తి వస్తే అవి కూడా కుళ్ళు కుతంత్రాలు, స్వార్థం అసూయ,ద్వేషం నరనరాన నింపుకుం
టాయని రచయిత ఈ నవల ద్వారా తెలియజేశారు.
ఈ నవలలో రచయిత చిత్తూరు జిల్లా వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు. స్థానిక సామెతలను, లోకోక్తులను, హాస్య
పూరితంగానూ వ్యంగ్యోక్తిగానూ చిత్రీకరించారు. పుత్తూరు ఈశ్వరాపురం గోవిందపాదం చుట్టూ తిరిగే ఈ నవల పలువురి
ప్రశంసలనందుకొంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి