ఓ సైరికుడా!
ఓ సైనికుడా! మాకు అండగా ఉండే మీకు ముందుగా దండాలు.
🙏🏼🙏🏼
ఓ సైరికుడా! (.రైతుబిడ్డ)
దేశం సస్యశ్యామలం చేసే బ్రహ్మవు నీవు.
సుజలాం సుఫలాం
అని గానయోగ్యమై మలయజశీతలములతో మేము
అలసటలేని బ్రతుకు
బాట నేర్పరచుకొనుటకు
నీ శ్రమజలసంపద
మూల కారణము కదా.
కానీ షడ్రసోపేతమైన
భోజనము దేశానికిచ్చి
ఉప్పుగంజితో
పచ్చిమిరపకాయతో
కడుపు నింపుకొనే ఓసైరికుడా!. నీ త్యాగం
అజరామరం.
దేశానికి నీ అవసరం
నూటికి నూరుపాళ్ళు
ఖచ్చితం.
నిన్నెలా ఆదుకోవాలి?
కవితలు రాసైన
కదిలిస్తాం ప్రభుత్వాలను భూస్వాములను.
కడుపునింపే
పల్లె అన్నపూర్ణ, అనుంగుబిడ్డా!
అందుకో నా కృతజ్ఞతాంజలులు.
ఆత్మహత్య వద్దు
మానుకో. ఇదే నా వేడుకోలు.జై కిసాన్
నీ నేస్తం నేను.
జై జవాన్!
కొండ కోనల్లో
మంచు వేళల్లో
ముంచుకొస్తున్న
ప్రమాద గడియల్లో
విడిగా, ఒంటరిగా
నీలాంటి మరొక సైనికుడితో పోరాటం.
ఆ ఆరాటంలో
ఆశువులు తృణప్రాయంగా విడిచే
ఓ అమృతమూర్తి
నీకు మరణం లేదు
ఓ అమరజీవి!
దేశం కోసం నీవు సందేశాలు ఇవ్వవు
ప్రాణాలనే ఇస్తావు
సంసారాన్ని
త్యజీస్తావు.
అందుకే
నీ జీవితం, నీ త్యాగం
తెలుసుకొని
నీకు సాయం చెయ్యడం నా కనీస
దర్మం.
చేస్తాను ,వేస్తాను,నీ హుండీలో నావంతు సాయం. వేస్తాను.ఉదయాద్రి పై బాలబానుని రాకతో
స్మరిస్తాను ఇద్దరు దైవాలను. నేను తాగేకాపీ,చదివే పేపరు సాక్షిగా మీరిద్దరే దేవుళ్ళు.
జై జవాన్ జైకిసాన్.
మూడో వాడు మా మగ్గం బాబాయ్.
ముగ్గురూక్షేమంగుండాలి. మాబ్రతుకులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి