మతంకాదు మానవత్వమే ముఖ్యమని
జగతిన ప్రజలంతా పరమేశ్వర స్వరూపాలని
అందరిలో ప్రవహించేది ఒకటే రక్తమని
జగమంత కుటుంబం నాదని
మాటలకే పరిమితమన్నది
పహల్ గావ్ లో మండువేసవిలో కుటుంబ సబ్యులతో
ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుటకై వెళ్ళిన
అమాయకపు ప్రజలపై ఉగ్రవాదులు
నీ మతం ఏమిటి అని అడిగి భార్య ఎదురుగానే
భర్తలను
విచక్షణ రహితంగా చంపిన సంఘటన
నాలుగు రోజుల క్రిందటే వివాహామై
హానీమూన్ కై వచ్చిన నవవధూవరులలో
భర్తను భార్య బ్రతిమాలిన బుల్లెట్లతో చంపడం
ప్రార్థన చేయించి చంపొంద్దని వేడుకున్నా
దేశప్రధాని మోడీకి చెప్పమని
విచక్షణ రహితంగా ప్రాణాలు తీయడం
కళ్లెదుటే జీవితాంతం తోడునీడగా ఉండవలసిన భాగస్వామి
అందనిలోకాలకు వెళ్లినట్లు చేసి
ఆ మాతృమూర్తుల కుటుంబ సభ్యుల కడుపుకోతకు కారణమై
అమాయకపు ప్రజలను
మతం పేరిట నరమేధానికి కారణమైన
ముష్కరులను ప్రశ్నిస్తున్నా
ప్రాణంపోసే హక్కు మీకు లేనప్పుడు
ప్రాణం తీసే హక్కు మీకెక్కడ?
లోకా సమస్తా సుఖినో భవంతు అన్నది పాటిస్తున్నామా
నరమేధానికి అంతం ఎప్పుడు?
(పహల్ గావ్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో అమాయకపు పౌరులు హతమైన సంఘటన చూసి ఆర్ధ్రతతో వ్రాసినది).
...........................
నరమేధానికి అంతం ఎప్పుడు?:- కవిమిత్ర,సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి