సమాధులను పూజిస్తాం!
సమాధులను గౌరవిస్తాం!!
సమాధులను ప్రేమిస్తాం !!
సమాధులను నిర్మిస్తాం!!!
దేవుళ్ళ సమాధులే
చర్చిలు- మసీదులు -గుళ్ళు -గోపురాలు
తరతరాలు
ఈ సమాధులను మోస్తాం
మోస్తూనే ఉంటాం!!!?
తరతరాలు
ఈ సమాధులను నిర్మిస్తాం
నిర్మిస్తూనే ఉంటాం!!!?
కానీ మనుషులను
మోసగిస్తాం !!
మనుషులను
ద్వేషిస్తాం !!
మనుషులను
పగబడతాం !!
మనుషులను
అసహ్యించుకుంటాం!!
పగలబడి నవ్వుతాం!!!
మనల్ని మనం
మోయాలంటే
మన మనుషుల్ని మనం
మోయాలంటే
భయపడతాం- పారిపోతాం
పక్కకు తప్పుకుంటాం
దూషిస్తాం - దూరమవుతాం
మనుషుల్ని ఎలా ప్రేమిస్తాం!!!?
=================================
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని. 14/04/2025
డా ప్రతాప్ కౌటిళ్యా 👏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి