ఈ అక్కల కర్ర మొక్కను హిందీలో అకరకరా,కర్ కరా అని అంటారు. ఇది మూల రూపంలో అరబ్లో లభిస్తుంది. భారతదేశంలో దీని ప్రచారం యునాని వైద్యుల ద్వారా చేయబడినది. దీని ప్రసిద్ధ ఔషధము వర్ష ఋతువులో తొలకరి జల్లు పడగానే దీని చిన్న చిన్న మొక్కలు మొలవడం మొదలవుతుంది.
దీని వేరు రుచి ఘాటుగా ఉంటుంది. ఇది అధిక వీర్యాన్ని కలిగిస్తుంది. ఈ మొక్క కొదగా ఉండి కాండంపై బెరడు బూడిద వర్ణంలో ఉంటుంది. చేదుగా ఉండి 3-4 అంగుళాల పొడవు అలా అంగుళం లావుగా ఉండి వీటి పుష్పాలు తెలుపు పసుపు పచ్చ రంగులలో ఉంటాయి. దీని కొమ్మలు, ఆకులు పుష్పాలు తెల్లగా బబూన్ మొక్కలాగా ఉంటుంది. మహారాష్ట్రలో దీని కాడలతో కూర వండుకుని తింటారు. ఈ అక్కల కర్ర మొక్క వేళ్ళు ముఖ్యమైన ప్రక్రియత్మకమైన పైరే ధ్రిన్ పేరుగల గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఔషధము చేసి తలనొప్పి తగ్గేందుకు, అపస్మారక స్థితికి, మంద బుద్ధికి, నత్తికి, గాయకుల కంఠ స్వరానికి పంటి నొప్పికి, గండ రోగములకు, నోటి దుర్వాసనకు, హృదయ రోగములకు, తుమ్ములకు, జ్వరానికి, శ్వాస దగ్గు ఉదర రోగాలకు, ఆకలి లేకపోవడం నెలసరి శూన్యత, పక్షవాతం వాజీకరణం మొదలగు దోషముల నివారణకు దీనిని ఉపయోగిస్తారు. ఇంతటి చరిత్ర కలిగిన మహత్తరమైన ఔషధ గుణధర్మం కలిగిన మొక్క ఈ అక్కల కర్రగా పిలుస్తారు.
దీని ఉపయోగాలు చాలా ఉన్నందువలన మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అరుదైన అక్కల కర్ర:.:- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి