ప్రైవేట్ విద్య పట్ల మోజు వీడాలి
- ప్రభుత్వ పాఠశాలల్లోనే
పిల్లల్ని చేర్పించాలని
ప్రభుత్వ పాఠశాలలు ప్రజల ఆస్తులని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల ప్రముఖ కాలిగ్రాఫర్ దిడ్డి సతీష్ పిల్లలకు చేతి రాతలో ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినీ, విద్యార్థులు వంగ మేఘన, ఆకారపు హరినాథ్ రెడ్డి, అనవేన వైష్ణవి, పెంతల దేవిశ్రీ, పొన్నాల వర్షిత్, ముస్కె కారుణ్యలు చేతిరాతలో అత్యంత ప్రతిభ కనబరిచారు. వీరి ప్రతిభకు మెచ్చి దిడ్డి సతీష్ ప్రశంసా పత్రాలు పంపించగా, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు సురేష్ , శ్రీవాణిలు మంగళవారం వాటిని పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రజల సొమ్ముతోనే ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని, ఉన్న ఊరు - కన్నతల్లి లాంటి ప్రభుత్వ పాఠశాలను ఆదరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి కష్టించి సంపాదించిన వేలాది రూపాయల డబ్బును వృధా చేసుకోవద్దని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఊషన్నపల్లి పాఠశాలలో సకల సౌకర్యాలతో పాటు ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, వర్క్ బుక్కులు, స్కూల్ యూనిఫాం, సన్న బియ్యంతో శుచి, రుచికరమైన మధ్యాహ్న భోజనం, ఇతర విద్యా సామగ్రిని ఉచితంగా అందిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో కంప్యూటర్ విద్యను ప్రవేశ పెడుతున్నామని, ఉచితంగా నవోదయ కోచింగ్ ఇస్తామని ఈర్ల సమ్మయ్య తెలిపారు. తల్లి దండ్రుల కోరిక మేరకు పాఠశాల పిల్లలకు తెలుగు, ఇంగ్లీష్ తో పాటు హిందీ భాషను నేర్పిస్తామన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, టీచర్లు అమృత సురేష్ కుమార్, కొంకటి శ్రీవాణి, పిల్లలు, తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి