సుప్రభాత కవిత : - బృంద
మసకేసిన మనసుకు 
మమతేదో  మెరిసినట్టు..
మరపురాక మధించే 
సమస్యకు దారి దొరికినట్టు..

చీకటిలో దిక్కు తోచక
సాగుతుంటే దూరాన
చిన్న వెలుగేదో రారమ్మని
పిలిచి అతిథ్యమిచ్చినట్టు.....

కరిగిపోయే కాలంలో 
కలిసిపోయే కలతలకు 
కనుచూపు మేరలో కల 
వరించే క్షణాలు కనపడినట్టు...

పొంగే అలల ఉత్సాహంలా
నింగిని సాగే కోరికకు
రంగుల విల్లేదో తోచి
వంగి దరికి చేరినట్టు..

అందని ఆకాశం 
అచ్చo గా మనకోసం 
అందమైన అందలమొకటి
అందుకొమ్మని పంపినట్టు..

కొత్తవెలుగులు మోసుకుంటూ 
మొత్తం మనకే ఇస్తానంటూ 
చిత్తం మురిసే ముచ్చటలన్నీ 
గుత్తిగా కొంగున కడ్తానంటూ...

వచ్చే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు