పద్యాలు : - ఉండ్రాళ్ళ రాజేశం
 మత్తకోకిల
అంటరానిది విద్యలన్నరు యాది జేసియు మూల్గుతూ
కంట నిద్రను మాని శోధన కంతులందున సాగుతూ
వెంట పొత్తము న్యాయ స్థానము పెక్కురీతిన వెల్గులై
వింటిబాణము బాబసాహెబు వీరులందరి సారథీ

కందం

అక్షరములు కల్గినపుడు
లక్షణముగ సాగు విద్య రాణించు జగతిన్
అక్షయముగనాంబేద్కర్
సాక్షిగ సాగేను బీదసాదల దరువై
కామెంట్‌లు