పార్టు...1దేశమంటేమట్టి కాదోయ్..!దేశమంటేమనుషులోయ్..!అన్నది నిన్నటిదేశభక్తి గీతమోయ్..!అది గురజాడ వారిగుండెచప్పుడోయ్..!నేడు దేశమంటే..?తరతరాలుగాయుగయుగాలుగాదగాపడిన దళితులేనోయ్..!నేడు దేశమంటే..?అణగారినఅణచి వేయబడినమోడువారినిబడుగు బలహీనబహుజన బ్రతుకులేనోయ్..!నేడు దేశమంటే..?ఆర్థికంగా చితికిఆకలికి అలమటించేఅస్థిపంజరాలేనోయ్..!నేడు దేశమంటే..?అజ్ఞానంలోఅంధకారంలోకొట్టుమిట్టాడేఅమాయకపు ప్రజలఆర్త నాదాలేనోయ్..!నేడు దేశమంటే..?అగ్రవర్ణ ఆధిపత్యానికిఅహంకారానికి బలైపోయేబానిస బ్రతుకులేనోయ్..!నేడు దేశమంటే..?చేయని నేరానికిన్యాయం అందని ద్రాక్షగాఏళ్లతరబడి జైళ్ళలో మ్రగ్గిపోయేనిస్సహాయుల నిట్టుర్పులేనోయ్..!విధివంచితుల విషాద గీతికలేనోయ్..!పార్టు...2...దేశమంటే మట్టి కాదోయ్దేశమంటే మనుషులేనోయ్అన్నది నిన్నటి దేశభక్తి గీతం..!అది గురజాడ వారి గుండెచప్పుడు..!నేడు దేశమంటే...?తరతరాలుగా కులవివక్షకుంపట్లో దహించుకుపోతూచీకటి గుహల్లో మ్రగ్గిపోతున్నదగాపడిన దళిత బహుజనుల గుండెలతపనలేనోయ్..!ఆరని మంటలేనోయ్..!నేడు దేశమంటే...?వేలాడే గబ్బిలాల్లావేర్లులేని జీవితాలేనోయ్...!చెదిరిన కలల మృత్తికలేనోయ్..!విధి విషంచిమ్మిన బలహీన వర్గాలకనిపించని కన్నీటి గాథలేనోయ్..!నేడు దేశమంటే...?మొలకెత్తని విత్తనంలాపండని పంటలా ఆర్థికంగా చితికిఅలమటించే అస్థిపంజరాలేనోయ్..!నేడు దేశమంటే...?చెరసాలలో బంధించబడిచిత్రహింసలకు గురౌతున్నన్యాయ రుద్రాక్ష లేనోయ్...!నేడు దేశమంటే...?అజ్ఞానపు మేఘాల కిందనలిగిన...ముసురుకున్నఅమాయకపు ప్రాణాలనిశ్శబ్ద గుండె చప్పుడులేనోయ్..!నేడు దేశమంటే...?అగ్రవర్ణ అహంకారపుఅడవిదొంగల కోరల్లో చిక్కుకునిబలైపోతున్న బానిస బ్రతుకులేనోయ్..!నేడు దేశమంటే...?అరచేతిలో జారిపోతున్నన్యాయబిందువులా...నిస్సహాయుల నిట్టుర్పులేనోయ్..!విధివంచితుల విషాద గీతికలేనోయ్..!
నేడు దేశమంటే..?...:- కవిరత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి