ఒంటరి దిగులును పోగొట్టి
జంటగ నేనుంటానంటూ
వెంట నడిచే తోడుగా
కంటిపాపలా తోడొచ్చే వేకువ!
కునుకు లేక ఎదురుచూచు
కనుల వెలుగు నింపి
కుదురు లేని మనసుకు తీపి
కబురు తెచ్చే వేకువ!
గాయమైన మదిలో
గేయమంటి బాధలో
రాయిగా మారిన రాత్రిని
మాయం చేసే వేకువ!
స్వప్నమైన ఆశలేవో
సత్యమల్లే ఎదుట నిలిపి
నిత్యం నీతోనే ఇక అంటూ
ముత్యం లా నవ్వే వేకువ!
మరచిపోయిన తలపేదో
మమతలాగా మురిపించి
మాయనే మాటుమాయం చేసి
మనసు నింపే వేకువ!
నిదుర రానివ్వని నిరీక్షణలో
నీరసించిన మానసానికి
అలవి కాని ఆనందం
ఆవరింపచేసే వేకువ!
అన్ని దిశలను అలముకుని
అంతరంగపు తిమిరాన్ని
తరిమి కొట్టి వెన్నుతట్టి
చెలిమి చేయ వచ్చిన వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి