సీతారామ కళ్యాణం సంబరాలు:- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-హైదరాబాద్
రామనవమి ఉత్సవాలు 
జరుగునట్టి సంబరాలు
విశ్వానికి ధర్మమునే
నేర్పునట్టి సంబరాలు!!

ధర్మానికి ప్రతిరూపం
రఘురాముడు తెలుసునులే
మానవుడై పుట్టి తాను
చూపునట్టి సంబరాలు!!

చైత్రమాస శుక్లపక్ష
నవమినాడు జన్మించగ
భరతభూమి మొత్తంగా
చేయునట్టి సంబరాలు!!

ఒకే మాట ఒకే నోట
ఒక బాణం ఒకే సతి
మాటతప్పనట్టి నరుని
కొలుచునట్టి సంబరాలు!!

దేశమంత కళ్యాణం
రామ సీత కళ్యాణం
ఓసీతా భక్తితోడ
పారునట్టి సంబరాలు!!

-----------------------------

కామెంట్‌లు