మౌనమేల ఓ ప్రియా....మాటలాడ వేల
మనిమాన్యాలడిగితినా చిన్నమాట తప్ప
మహా సామ్రాజ్య మడిగితినా నీ మంచి మనసు తప్ప
మందరాలడిగితినా నీ ముద్దు మోము తప్ప
పదవు లేమి అడగలేదు నీ మమకారం తప్ప
పంచ భక్షాలు కోరలేదు నీ మాటల రుచి తప్ప
రత్న రాసులడగలేదు నీ నవ్వుల గళ గళ తప్ప
రాజ్యాలే కోరలేదు నీ ప్రేమ సామ్రాజ్యం తప్పు
తపము లేవి చేయలేదు నీ నామ జపము తప్ప
తారలేవి కోరలేదు నీ చేతి స్పర్శ తప్ప
స్వర్గాలను కోరలేదు నీ సహచర్యం తప్ప
స్వర్ణ శిఖరమడగలేదు నీ సాన్నిధ్యం తప్ప
చేరి కోరి వచ్చానని చిన్న చూపు చూడకే
చేరవచ్చు ప్రియుని చెలిమి వలదనుట భావ్యమే
కఠిన శిలగ మారినీవు కాలమిలా గడపకే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి