కొండ చరియల పైనుండి
బండరాళ్ళ మధ్యలో పడి
కిందికి దుడుకుగా దూకుతూ
పల్లము వెదుకుతూ పయనించే..
జలపాతపు హోరులో
జీవన నాదం ఇమిడి లేదా?
ప్రవహించే నీటి నడకలో
జీవనగమనం తోచు కాదా?
ఎంత ఎత్తున పుట్టినా
తన పయనం నేలమీదే!
ఎన్ని మలుపులు తిరిగినా
తుది గమ్యం కడలి ఒడికే!
అందరి పుట్టుక ఒకేలాగే
అందరి దేహం ఒకటే ధాతువే
అందరూ చేరే గమ్యం ఒకటే
అందరికీ మంచి చెడు ఒకటే!
గుడిలో దేవుడి ముందు
నిరంతరము వెలిగే దీపంలా
మంచితనపు జ్యోతి కాంతి
మదిని మందిరం చేయదా?
ప్రేమను పంచే మనసుకు
సీమలు హద్దు కాగలవా?
కరుణ చూపే కనులకు
కనపడని దైవం వుంటుందా?
మనకోసం తరలి వచ్చే
కనిపించే దైవమైన కర్మసాక్షికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి