మీన పుచ్చం అంటే చేపతోక అని అర్థము. ఈ సాగో చెట్టు హిమవత్ పర్వత ప్రాంతంలో కనబడుతుంది. గట్టిగా మేకుల్లాగా ఉండే మీనపుచ్చం చిగుళ్ళు చేపల పోలుసులు లాగా ఉంటాయి. ఇది తాళ జాతికి సంబంధించిన వృక్షంగా పేర్కొన్నారు. చెట్టు పరువంలో ఉన్నప్పుడు ఆకులు పూర్తిగా విచ్చుకుని తాళ జాతులన్నింటిలోకి పెద్దవిగా ఉంటాయి కానీ ముసలితనంలో మాత్రం పూర్తిగా రాలిపోయి బట్టతల ప్రాప్తిస్తుంది. ఈ మీన పుచ్చ వృక్షం నుంచి మనకు ఉపయోగపడే పదార్థాలు ఎన్నో లభిస్తాయి. దాని పీచుతో పగ్గాలు పెనుతారు దాని ద్రవం నుంచి ఒక రకమైన పిండి పదార్థం లభిస్తుంది. అది సగ్గుబియ్యానికి దగ్గరగా ఉంటుంది. కరువు రోజుల్లో ఇక్కడి కొండ జాతులకు ఇదే ఆకలి తీరుస్తుంది.
ఇలాంటి వృక్షాలని చూడటం తెలుసుకోవడం చాలా అవసరం.
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి