పెద్దలు అందించేగొప్ప ఆస్తులు... పుస్తకాలే...!:- కోరాడ నరసింహా రావు !

బాలల పుస్తకమంటే.... 
   రంగు రంగు ల పసువులు, పక్షులు, కార్టూన్లు , బొమ్మలు.... 
  విజ్ఞానము, వినోదము లు కలగలిసిన విందు భోజనమే....! 
 చిలుకల్లా కధలు చదువుకొనుచు...కోయిల ల్లా గేయాలుపాడుకొనుచు
  కొత్త కొత్త విషయాలను ఆసక్తిగా తెలుసు కొనుచు... 
  ఉత్సాహముగా విజ్ఞాన మును పెంపొందించుకుని, 
 ఉత్సాహమును, ఉల్లాసమును... 
   కలిగించి ఆనందముతో ఆరోగ్యముగా పిల్లలనుంచే దివ్యమైన ఔషధాలే ఈ పుస్త కాలు...! 

పిల్లలకు పుస్తకాలను చదివే అలవాటును కలిగించి... ఆసక్తినిపిల్లల లో ,పెద్దలే పెంచాలి....
నేటి బాలలను, రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చగలిగే మంచి గురువులు... స్నేహితులు 
 మంచి పుస్తకాలే...! 
   ఇవే ఈ పుస్తకాలే పెద్దలు పిల్లలకు అందించే గొప్ప ఆస్తులు..!! 
       ******
కామెంట్‌లు