"సామి" సంప్రదాయం:- - యామిజాల జగదీశ్
 ఉత్తర స్వీడన్ పరిధిలోనిదే "సామి" ఓ కుగ్రామం. అడవులు మధ్య ఉన్న ఈ గ్రామంలో కొన్ని ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. బయటివారికి, ఇది రహదారి ముగింపులా అనిపించవచ్చు, కానీ ఎవెలినాకు, రహదారి ఇక్కడే ప్రారంభమవుతుంది.
సామి ప్రజలు ఉత్తర ఐరోపాలోని స్థానిక ప్రజలు, "రెయిన్ డీర్"  కాపరులు. వారి భాష, సాంస్కృతిక గుర్తింపు ప్రత్యేకమైనవి. 
ఎవెలినా తమ సంప్రదాయాలను కాపాడుకోవడం పట్ల మక్కువెక్కువ. 
సామి సంస్కృతి, రెయిన్ డీర్  పెంపకం గురించి బయటి ప్రపంచానికి  తెలియాలని ఆమె కలలు కన్నాది.
సామి సంస్కృతిలో ఏ ఇంటి బిడ్డ పుట్టినా ఆ కుటుంబానికి గ్రామపెద్ద ఒక రెయిన్ డీర్‌ను ఇస్తారు. వారు జీవితాంతం వాటిని జాగ్రత్తగా చూసుకోవడమనేది పవిత్రమైన లక్ష్యంగా పరిగణిస్తారు. అక్కడ ఇది ఒక సంప్రదాయం. సామి సంస్కృతి గురించి ఇతరులకు అవగాహన కల్పించడానికి, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్ళను ఎవెలినా కృతనిశ్చయంతో అధిగమిస్తుండటం విశేషం.
సామి గ్రామాన్ని సామెబై అనికూడా అంటారు. రెయిన్ డీర్ పెంపకం, వేట, చేపలు పట్టడం ఇక్కడి ప్రధాన వృత్తులు. 
స్వీడన్‌లో సామిలాంటి గ్రామాలు యాభైకిపైగా ఉన్నాయి. ఇవి అటవీ,  పర్వత పరిధిలోనివి. ప్రతి గ్రామానికీ ప్రత్యేక లక్షణాలు, పద్ధతులు ఉన్నాయి. 

కామెంట్‌లు