ఆ ఊరిలో రాజయ్య అనే డాక్టరుకు మంచి పేరు ఉంది. అది పల్లెటూరు కాబట్టి పేషెంట్లు తన దగ్గరకు రాలేక పోతే తానే వారి ఇంటికి వెళ్ళి, వైద్యం చేసేవాడు. ఆ ఊరికే నర్సయ్య అనే డాక్టరు కొత్తగా వచ్చాడు. నర్సయ్య వచ్చి ఎన్నాళ్ళు అయినా పేషంట్లు నర్సయ్యను పట్టించుకోవడం లేదు. ఒకరో ఇద్దరో నర్సయ్య దగ్గర వైద్యం చేయించుకున్నా ఆ వైద్యం ఫెయిల్ అయ్యి, తిరిగి రాజయ్య దగ్గరకే వచ్చేవారు.
రాజయ్య విజయ రహస్యం ఎమిటో తెలుసుకోవాలని నరసయ్యకు అనిపించింది. ఒకరోజు ఒక పేషెంట్ తీవ్రమైన జ్వరం వచ్చి, ఎంతకూ తగ్గక పోతే రాజయ్య వారి ఇంటికి వెళ్ళాడు. అతని వెంట నర్సయ్య కూడా వెళ్ళాడు. రాజయ్య ఆ పేషెంటును చూస్తూ, "నీ జ్వరం ఎంతకూ తగ్గడం లేదు. మరి ఏమి తింటున్నావు?' అని అడిగాడు. అప్పుడు పేషెంట్ భార్య ఇలా అన్నది. "మొన్న మా ఇంట్లో చికెన్ వండాము. వద్దు వద్దని అన్నా చికెన్ బాగా తిన్నాడు." అని. "నువ్వు ఇలా ఉంటే నీ రోగం ముదిరి, పై లోకానికి వెళతావు. ముందు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి." అన్నాడు డాక్టర్ రాజయ్య. సరే అన్నాడు పేషంట్.
ఈ సారి మరొక వ్యక్తికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఈ విషయం తెలిసి నర్సయ్య డాక్టర్ ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఏమి ఆహారం తీసుకుంటున్నాడో అడిగాడు. "ఇడ్లీ తప్ప ఏమీ తినడం లేదు. మొన్న మా ఇంటికి చుట్టాలు వస్తే మటన్ మరియు చేపలు వండి పెట్టాము. ఆ నాన్ వెజ్ ఫుడ్ తినమని బతిమాలినా తినటం లేదు. ఇడ్లీలు తింటున్నాడు. కానీ జ్వరం తగ్గడం లేదు." అన్నది భార్య. అప్పుడు నర్సయ్య ఇలా అన్నాడు. "భార్య చెప్పినట్లు వింటే తప్పా? ఆమె చెప్పినట్లు మటన్, చేపలు తింటే తప్పేమిటి? ఆ మటన్, చేపలు తినక, ఆ దిక్కుమాలిన ఇడ్లీలు వంటివి తిన్నావో! పైకి వెళతావు. నీ భార్య చెప్పినట్లు మటన్, చేపలు బాగా తిను." అని. అప్పుడు పేషంట్ తల గోడకెసి, బాదున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి