పెద్దల ఆశీర్వాదం తీసుకోనేపుడు పాదాల కెందుకు నమస్కరిస్తాం? : సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పెద్దల దగ్గర మన ఆశీర్వాదం తీసుకోనేటపుడు వారి పాదాలకు నమస్కరించడం మన సంప్రదాయం. అయితే అలా చెయ్యడం లోని అర్థమేమిటో తెలుసుకుందాం.
మన శరీరంలో తల ఉత్తర దృవం అయితే పాదాలు దక్షిణ దృవం.వ్యతిరేక దృవాలే ఆకర్షించుకుంటాయి.అప్పుడే కదా శక్తి విడుదల అవుతుంది. అలానే మనం పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోనేటపుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసుకుంటాం. అప్పుడు వారి పాదాలలోని దక్షిణ దృవం మన తలలో గల ఉత్తర దృవం తో ఆకర్షితమై శక్తిని వెలువరుస్తుంది.అందుకే మన హిందు సంప్రదాయంలో పెద్దల కాళ్ళకు నమస్కరిస్తాం. 
చూసారా ఇలా మన సంప్రదాయంలో ప్రతీ దానికి ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది. మన సంప్రదాయాలను అర్థం లేనివని కొట్టి పారేయకుండా వాటిలోని పరమార్థం తెలుసుకొని ఆచరిద్దాం.
—-------------------------------

కామెంట్‌లు