తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా సంస్కృతుల పరిరక్షణ దిశగా ప్రభుత్వం పఠిష్టమైన చర్యలు చేపట్టిందన్నది నిర్వివాదాంశం.తెలుగు భాషా సంఘాన్ని పూర్తిగా పునరుద్ధరించి వాటికి నిర్ధిష్టమైన కార్యక్రమాలను రూపొందించి, పర్యవేక్షణకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు.అధికారికంగా అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ప్రముఖ తెలంగాణా కవుల అముద్రిత రచనలను ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో వెలుగు లోనికి తీసుకురావడం,తెలంగాణా కవులు, కళాకారులు గౌరవించి వారికి గౌరవ వేతనాలను అందించడం, కాళోజి, దాశరధి ల పేరిట ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానం, ఆరోగ్య విశ్వ విద్యాలయానికి కాళోజీ పేర్ పెట్టదం, తెలంగాణా తెలుగు సాహిత్య అకాడమీ పున: ప్రారంభంం వంటి చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే చర్యలు చేపాట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు మరిన్ని క్రియాశీలక చర్యలు ఆశిస్తుండగా, ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం తెలుగు భాషాభిమానులకు కొరుకుడు పడని విషయం అయ్యింది.ఎందరో విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు మాతృభాషలోనే కనీసం పదవ తరగతి వరకు విద్యాబోధన సాగాలని సూచిస్తున్నారు. మాతృభాషలో విద్యాబోధన వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రపంచ దేశాలలో కూడా ఎన్నో విస్తృత పరిశోధనలు జరిగాయి. అబ్దుల్ కలాం, శ్రీనివాసన్ రామానుజం,స్వామినాధన్, ఆర్ కె మీనన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ,ఎందరో శాతృవేత్తలు , మేధావులు మాతృభాషలోనే చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు.ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం తెలుగు భాషాభిమానులకు మింగుడు పడని విషయం. పాశ్చాత్య సంస్కృతి వేగంగా చొచ్చుకొస్తున్న వేళ తెలుగు భాష కాసింతైనా బ్రతికి బట్టగట్టగలుగుతోంది అంటే అది ప్రభుత్వ పాఠశాలల దయ వలన.ప్రాథమిక స్థాయిలో తెలుగు లోనే విద్యాబోధన జరిగేలా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాలి. తెలుగు భాషా దీపం ఆరిపోకుండా ఉండాలంటే కనీసం ప్రాథమికోన్నత స్థాయి వరకైనా తెలుగు మాధ్యమంలో చదవాలనే నిబంధన రావాలి. అంతేగాక ఇంటర్మీడియెట్, డిగ్రీ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ఎంచుకునే అవకాశాన్ని రద్దు చేయాలి. విద్యార్థులందరూ విధిగా తెలుగునే చదివి తీరాలనే నిబంధన పెట్టాలి. తెలుగును ‘ద్వితీయ భాష’ అని పిలవడమే ఎంతో అసహ్యంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ద్వితీయ భాష కావడం ఏమిటి? ఎక్కడి నుంచో వచ్చిన ఆంగ్లం ప్రథమ భాష కావడం ఏమిటి? ఇది మనల్ని మనం అవమానించుకోవడం కాదా? ఈ తీరు మారాలి. జాతి జనులలో తెలుగు భాషా పునాదులు గట్టిగా పడాలంటే ప్రాథమిక పాఠశాలల్లోనే తెలుగు భాష ఉపాధ్యాయులను నియమించాలి. అలాగే భాషాభివృద్ధికి కృషి చేయడానికి తెలుగు భాషకు ఒక మంత్రిత్వశాఖను కేటాయించాలి. అధికార భాషా సంఘానికి కూడా హైకోర్టుకున్న అధికారాలను ఇవ్వాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగును అమలు పర్చకపోతే జరిమానాలు విధించే అధికారం, శిక్షలు వేసే అధికారం, ఉద్యోగులను సస్పెండ్ చేసే అధికారం అధికార భాషా సంఘానికి ఉండాలి. అప్పుడు కాని తెలుగు భాష అమలు సవ్యంగా సాగదు. త్వరగా అంతరించి పోయే భాషలలో తెలుగు భాష కుదా వుందని యు నెస్కో రెండేళ్ల క్రితమే హెచ్చరించినా మన మాతృభాషను పరిరక్షించుకోవడానికి మనం చేస్తున్న కృషి అతి స్వల్పం. 2020 నుండి నేటి వరకు నిరాదరణ కారణంగా ఎన్నో దిన, వార, పక్ష, మాస పత్రిక తో పాటు చాలా ఆన్ లైన్ పత్రికలు మూతపడినట్లు గణంకాలు తెలియజేస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు, సినిమాల ద్వారా తెలుగు భాష దారుణం గా ఖూనీ అవుతొంది. స్కూళ్ళ నుండి తెలుగు నెమ్మదిగా మాయమవుతూ పర భాషలు వేగంగా ప్రవేశిస్తున్నాయి. తెలుగువారి ఇళ్ళలో తెలుగు తప్ప ఇతర భాషలే వినవస్తున్నాయి. తెలుగు భాషకు నిస్సందేహంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు వారందరూ త్వరగా మేల్కొని భాషను బతికించుకునే ప్రయత్నం చేయాలి.
మన తెలుగు భాషను మనమే బ్రతికించుకోవాలి:- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి