సామజిక సేవా పరాయణుడు-పూలే :-నామ వెంకటేశ్వర్లు,-స్కూల్ అసిస్టెంట్ తెలుగు,- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటిపాముల, నల్లగొండ జిల్లా.

  పీడిత వర్గాల పితామహుడు, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, బడుగు వర్గాల బాంధవుడుగా తను ఆనాటి శూద్ర అతిశూద్ర వర్గాలకు విశేష సేవలందించినందుకు గాను ఆనాటి సమాజం,  బ్రిటిష్ వారి చేత మహాత్మా అనే బిరుదు పొందినటువంటి మహానీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు అందరికీ 🌹🌹🌹🌹.
           పేరుకు అర్థం :- మరాఠీ,  ప్రాకృతం,  సంస్కృత భాషలో జోతి అంటే వెలుగు లేదా నక్షత్రం అని అర్థం. బ్రాహ్మణులు జ్యోతి అని అంటారు. ఇతరులు దాన్ని జోతి అని పిలుస్తుంటారు.జ్యోతిరావు మాత్రం ఎప్పుడు జోతి అనే పలికేవాడు. రావు అనేది మరాఠీలో ఒక గౌరవ సూచిక పదం. (బహుశా ఇది దక్షిణాది ప్రభావం వలన వచ్చినది అని అంటుంటారు.)  ఆయన్ని జోతిబా అని కూడా అంటారు.  సంబోధనలో ఆప్యాయతను సూచిస్తుంది పదం.
    జ్యోతిరావు పూలే గారి తండ్రి పేరు గోవిందరావు, మరాఠీ  సంప్రదాయంలో తండ్రి పేరు పేరు యొక్క మధ్యలో వస్తుంది. అందుకే జ్యోతిరావు పూలే గారిని జ్యోతిరావు గోవిందరావు పూలే అని పిలుస్తుంటారు. జ్యోతిరావు పూలే గారి ఇంటి పేరు పూలే కాదు నిజానికి వారి ఇంటిపేరు 'గొరేహ' . వారి పూర్వీకులది సతారా జిల్లాలోని'  లాల్ గుల్' అనే ఊరు. ఎటువంటి గుర్తింపు లేని చిన్న గ్రామం. పూలే గారి ముత్తాత ఆ ఊర్లోనే నివాసం ఉండేవారు. ఆ ఊరిలో ఒక రెవెన్యూ అధికారిగా బ్రాహ్మణుడు ఉండేవాడు, ఇతను పూలే ముత్తాత కుటుంబాన్ని చాలా వేధిస్తుండేవాడు. ఆయన పెట్టే కష్టాలకు తట్టుకోలేని పూలే తాతగారు ఆ బ్రాహ్మణ ఉద్యోగిని చంపేసి భయంతో పూణేకి పారిపోతారు, పూణేలో వీరు తోటల పెంపకం పనులు చేసేవారు, వీరు ఆనాడు 'మాలి'  కులానికి చెందినవారు, వాళ్ల కుల వృత్తి కూడా తోటలు పెంపకం చేయడం, ఈ మాలి కులం ఆనాడు శూద్ర కులానికి చెందినటువంటిది. పూణేను పరిపాలించే బ్రాహ్మణులు ఆనాడు పూలే కుటుంబంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేమిటంటే పూల తోటలు పెంచి పూలను మాకు సరఫరా చేయాలి. 
      పూలే గారి పుట్టిన సంవత్సరం కూడా చాలామంది ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ ఎక్కువ మంది 1828 ఏప్రిల్ 11న జన్మించారని అందరు భావిస్తారు, అందుకనే అతని జయంతిని ఏప్రిల్ 11న జరుపుకుంటాం. పూలె గారి జీవిత చరిత్ర గురించి పుస్తకం అంటూ ఒకటి ఇంతవరకు లేదు ఉన్నదల్లా ప్రచారం కోసం పురాణాల్లా రాసుకున్నవే. పూలే రాసిన రచనలు ఆయన నడిపిన ఉద్యమాలు స్థాపించిన సంస్థలను మనం ఆయన జీవిత చరిత్రగా భావిస్తాం. పూలే గారు 1848లో మాధ్యమిక విద్యను పూర్తి చేశారు.  పూలె గారి తండ్రి ఆనాటికే పూణా లో విజయవంతమైన భవననిర్మాణ కాంట్రాక్టర్ గా  ధనవంతుడిగా జీవితాన్ని గడిపేవారు. అందుకనే పూలే గారికి ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా రాలేదు, అతని యొక్క ఆర్థిక అవసరాలన్నీ అతని వ్యాపార కుటుంబం తీర్చే స్థాయిలో ఉండేది. పూలే గారు మొదటగా చదివిన,  తనలో మార్పు తెచ్చిన పుస్తకం థామస్ ఫైన్ రాసిన 'మానవుడి హక్కులు'. ( రైట్ అప్ మ్యాన్ 1847 సం..)
      తొమ్మిది సంవత్సరాల సావిత్రిబాయి తో 13 సంవత్సరాల వయసులో జ్యోతిరావు పూలే గారికి వివాహం జరిగింది. ఆనాటి వర్ణ వ్యవస్థలో శూద్రులకు, అతిశూద్రులకు  మరియు అన్ని  వర్ణాల స్త్రీలకు  చదువుకునే హక్కు లేదు,  ఆ అవకాశం బ్రిటిష్  వారు  భారతదేశం వచ్చిన తర్వాత లభించింది. అప్పుడు పూలే గారు చాటుమాటుగా వెళ్లి చదువుకోవడం జరిగింది. 
# సామాజిక సేవలో :- పూలె గారు తాను చదువుకున్న తర్వాత అనేక పుస్తకాలు చదివిన తర్వాత సామాజిక సేవ చేయడానికి పూనుకోవడం జరిగింది. ఆనాటి సమాజం వర్ణవ్యవస్థతో  ప్రజలు చాలా దుర్బరమైన జీవితం అనుభవించేవారు. పూలె గారు మొదటగా 1848 లో శూద్ర, అతిశూద్ర బాలికల కోసం మొదటిసారిగా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల స్థాపనలో కొంతమంది అభ్యుదయ వాదులైన బ్రాహ్మణ మిత్రులు కూడా సహాయ సహకారాలు అందించారు. ఆనాటి సనాతన బ్రాహ్మణులు పాఠశాలలో   విద్యను బోధించే ఉపాధ్యాయులను బెదిరించి చదువు చెప్పడం మానేటట్టు చేశారు. ఆ సమయంలోనే పూలే గారు స్వయంగా తన భార్యకు చదువు నేర్పించి,  ఉపాధ్యాయురాలుగా నియమించడం జరిగింది. అందుకే గొప్ప ఘటికుడు అని పూలే గారు అనవచ్చు. ఆ తరువాత రాత్రి బడి 1855లో ప్రారంభించారు. (ఉదయం వేళలో పనులు చేసుకునే వారికి రాత్రి సమయం లో చదువు నేర్పేవారు ) ఆ తర్వాత అన్ని వర్గాల స్త్రీలకు చదువు చెప్పడానికి పాఠశాలలు ప్రారంభించాడు. ఇది చూసి తట్టుకోలేని ఆనాటి సనాతన భ్రమలు 1856లో అతనిపై హత్యాయత్నం కూడా చేశారు. అయినా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లినటువంటి ధీరుడుగా పూలె గారిని చెప్పవచ్చు. ఆ తర్వాత భర్త చనిపోయినటువంటి స్త్రీలకు మరల వివాహం చేయడానికి 1860లో మొదటిసారిగా వితంతు వివాహాన్ని జరిపించాడు. ఆనాటి తల పాలనలో ప్రజలందరినీ కుల మత వర్ణ భేదం లేకుండా లౌకిక భావనతో పాలించినటువంటి శివాజీ మహారాజు గారి యొక్క చరిత్రను కూడా తెలుసుకొని అతని చరిత్రను రాసి,  అప్పటినుండి    శివాజీ ఉత్సవాలను గొప్పగా జరిపించినటువంటి ధీరుడు పూలే గారు. ఆ ఉత్సవాలు కొన్ని కారణాలవల్ల కొందరి ప్రయత్నాల వల్ల కనుమరుగు కావడం జరిగింది. శివాజీ గురించి 1869 లో 'శివాజీ పోవడ ' అనే దీర్ఘ కవితను రాశాడు. ఆ తర్వాత 1873 జూన్ 1న గులాబీ అనే పుస్తకాన్ని మరాఠి లో రాశాడు, ఆనాటి పీష్వా పాలకుల యొక్క అణచివేత వలన ఈ పుస్తకం 100 సంవత్సరాల వరకు ముద్రణకు నోచుకోలేదు. పూలె గారి యొక్క ఉద్యమాలకు ఈ రచనలే బలం చేకూర్చాయి. తన సేవలో కొనసాగింపు కోసం 1873లో సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు. దాని ద్వారానే ఆ తర్వాత అనేక కార్యక్రమాలు చేపడతారు. సత్యశోధకు సమాజం అంటే సత్యాన్ని వెతికే సమాజం అని అర్థం. ఈ సమాజంతో అతను 1890లో తన మరణించేంతవరకు కొనసాగాడు. 1870 నుండి 1882 వరకు పూలే పూణే మున్సిపల్ కౌన్సిల్  నామినేటెడ్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు. దేశంలో మొట్టమొదటిసారి మద్యపానం కు వ్యతిరేకం గా పోరాడిన భారతీయుడు పూలే గారు. తర్వాత కాలంలో గాంధీజీ తలపెట్టిన రెండు ఉద్యమాలు సత్యశోదన, మద్యపాన నిషేధం పూలె గారు మొదలెట్టినటువంటి వాటికి కొనసాగింపు నే అనవచ్చు. 1878లో మరాఠీలో నందు 'తేజ్  మండలి 'ప్రారంభించాడు. (ఇది మరాఠీ పుస్తకాలను ప్రోత్సహించే సంస్థ సహజంగానే కొత్త లౌకిక భావాలను ప్రోత్సహించేది ) అది అంతగా ముందుకు సాగలేదని రనడే జీవిత చరిత్ర పేర్కొన్నారు. ఆయన గారు శ్రమజీవుల బతుకు బాగుపడడానికి ఆయన మద్యపాన నిషేధ ఉద్యమం చేపట్టారు. కింది కులాల వారు తమ ఆచారాలను తామే నిర్వహించుకోవాలని బ్రాహ్మణుల  పాత్ర ఉండొద్దని తెలియజేశాడు, కార్మికుల ఇళ్లలోని ఆచారాలను ప్రక్షాళన చేసి ప్రపంచానికి చాటిచెప్పాడు. పూలె కార్యక్రమంలు చదివు వరకే పరిమితం కాలేదు, ఆయన తన ఇంట్లోని మంచినీటి బావి నుండి నీళ్లు తీసుకెళ్లేందుకు  అస్పృశలకు అనుమతించారు, ఇలాంటి చర్య ధైర్యంతో కూడుకున్నది. దీనిని పూలె తరువాత పెరయర్ గారు కొనసాగించాడు. 1868 లో అదొక పెద్ద విప్లవంమే 
 అప్పటిదాకా అగ్రకులాల వారెవరు అ పని చేయలేదు. పూలే గారు ఒట్టి డంభాచారాలు కొట్టేవాడు కాదు, విప్లవ పాఠాలు వల్లించడం కాదు విప్లవ కార్యాచరణ ఉండాలని నమ్మేవాడు.చెప్పిందించేసి చూపించేవాడు. 19 శతాబ్దం నాటి సంస్కర్తలు ఎవరు మహిళా సమస్యలను ఆయనలా పట్టించుకోలేదు. మహిళా సమస్యల పట్ల ఆయన దృష్టిని తాను శూద్ర, అతి శూద్ర  మహిళల కోసం ప్రారంభించిన పాఠశాల చాటి చెబుతుంది. 1888 మే 11న పూణేలో ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది, ఈ సభ సైద్ధాంతిక,  విద్య రంగాలలో ఉద్యమాలను,  వాటికోసం సమస్యలను నిర్మించడంలో ఆయన ప్రభావాన్ని చాటి చెప్పేందుకు బహిరంగ సభ జరిగింది. ఆ సభలో పూలే కు ఎంతో గౌరవంతో ' మహాత్మా'  అనే బిరుదును ప్రధానం చేశారు. అనంతరం గాంధీని మహాత్మా అని పిలుచుకునే సంప్రదాయం ఇక్కడినుండి వచ్చింది. ఈ బిరుదు గాంధీ గారికి ఎవరు ప్రధానం చేయలేదు.. ఇది ఆర్టిఐ యాక్ట్ ద్వారా తెలిసింది. ఈ బిరుదు పొందినప్పుడు అతని యొక్క జీవితం చరమాంకానికి చేరుకున్నది. పూలె గారు 
 చివరగా రాసిన పుస్తకం 'సార్వజనిక సత్య ధర్మ పుస్తకం ' ఆ పుస్తకం పూర్తిచేసే లోపునే అతనికి పక్షవాతం మరియు ప్లేగు వ్యాధి సోకడం జరిగింది. కుడి వైపు శరీరమంతా అచేతన స్థితిలో ఉన్నప్పుడు తన ఎడమజీతోనే రాసి ఆ పుస్తకాన్ని పూర్తి చేశారు. (1889 ఏప్రిల్ 1న ఆ పుస్తకం పూర్తి చేశారు ) 1890 నవంబర్ 28న వదిలారు. సమాజసేవ కార్యకలాపాలకు పిల్లలు ఉంటే స్వార్థం పెరుగుతుందని , పిల్లలే వద్దనుకున్న గొప్ప మహానీయుడు పూలె గారు. ఆయన చనిపోయిన తర్వాత 1891లో ఆయన దత్తపుత్రుడు పుస్తకాన్ని వెలువరించారు. రచన ను వెలువరించడ మే కాకుండా సావిత్రి బాయి పూలె  గారు ప్లేగు వ్యాధి సోకి  మరణించిన తర్వాత కూడా సత్యశోధకు సమాజాన్ని కొనసాగించినటువంటి వారు వారి దత్తపుత్రుడు యశ్వంత్. పూలె గారు చేసినటువంటి సేవ మరుపురానిది,  అలాంటి సేవలు చేసిన వారు ఇంతవరకు కూడా లేరు. వారి కార్యక్రమాలు ఆనాటి సమాజ గమనాన్ని మార్చాయి.  ఇప్పుడు చేసే సేవా కార్యక్రమాలు అన్ని ఓటు రాజకీయాల కోసం చేసేవే. ఇలాంటి గొప్ప మహనీయుని సేవలను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ.......

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం