కాలి పగుళ్ల సమస్య సామాన్యమైంది కాదు. అది మానసికంగానూ వేధిస్తుంటుంది. ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. స్త్రీలకు అందమైన పాదాలు ఒక పెద్ద అసెట్ అని తెలిసిందే కదా? చాలా మంది రకరకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. కొందరు వైద్యుల సలహాతో వివిధ రకాల మందులు వాడినా ఆశించిన ఫలితం లేక విసుగు చెందిన వారూ ఉంటారు. తగినంత తేమ లేకపోవడం, ఎక్కువగా తడిలో పాదాలు నానుతుండడం, మురికికి ఎక్కువగా ఎక్స్ పోజ్ కావడం కాలి పగుళ్ల సమస్యకు ప్రధాన కారణాలు. అధిక శాతం మందికి పాద సంరక్షణపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి నొప్పికి దారి తీస్తుంది. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కూడా దారి తీయవచ్చు. కొవ్వొత్తి వెలుగునివ్వడమే కాదు పాదాలకు ఒక రూపునిస్తుంది. మైనం ఆవనూనెతో కలిపి రాత్రిపూట పగుళ్లపై రాయాలి. గ్లిజరిన్, రోజ్ వాటర్‌తో కలిపి ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి ముందు రాయాలి. నువ్వుల నూనె కూడా ఈ సమస్య నివారణకు పనిచేస్తుంది. పడుకునే ముందు పాదాలకు మర్దన చేయాలి. అరటి పండు గుజ్జు కూడా పదాల పగుళ్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. పగుళ్లు తొందరగా మానిపోయేలా చేస్తుంది. పసుపు, తులసి, కర్పూరం సమాన మొత్తాల్లో తీసుకుని వీటికి అలొవెరా జెల్ కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెపుతున్నారు.
కాలి పగుళ్ళు:- - యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి