దేవాలయం :- కొప్పరపు తాయారు
ఆకాశపు అందాలు భాను స్పర్శ
అందకనే దైవసన్నిధిలో గంటమ్రోగ
జగతి జాగ్రత్త గా లేచి అనుభవించే
అపురూప సందేశం,తెల్లవారెను,కోడి కూసెను

హృదయాలు ఉవ్వెత్తున ఉప్పొంగే 
పరుగులిడ,పరమాత్మ సన్నిధి చేర 
తొందర లాయే,సమయాలాపన
విజృంభించ, సందడి అద్ధడి అధికం 

పరుగులు పారమార్థికత తెలియకుండె
మనసు బుద్ధిని లొంగదీసి,వంగదీసి దారిన
పెట్టే,చేరె పరమాత్మ సన్నిధి దేవాలయం
పూజా కైంకర్యాలు సలుప తృప్తి తో

కైమోడ్చి మనఃస్పూర్తిగా పూజలు 
సలిపి, దైవచెంతన చింతలు లేక
నిర్పూచీగా నిర్భయంగా, వీడ్కోలు తెలిపి 
ప్రసాదం ఆరగించి  కనులారా తిలకించే !



కామెంట్‌లు