చిత్రానికి పద్యాలు : -ఉండ్రాళ్ళ రాజేశం
మత్తకోకిల 
ఎండ వానల నీడనిచ్చును పెంచినంతన చెట్టులై
కండగల్గిన చాలకుండదు కాచు మైత్రి బంధమై 
బండ కొండల పెంచి వృక్షము బాసటందున సాగుతూ 
 నిండు రూపము పచ్చనైనది నేటి రాముడు పద్మమై 
 
ఆటవెలది
వనము పెంచ తపన వనజీవి రామయ్య 
పచ్చదనము కొరకు పరుగుబెట్టు 
అక్షరాల నందు లక్షణ తలపాక
ఆకు పచ్చ రూపు అవని మెచ్చు

 కందం

 వనములు నిలిచిన ధరణిన
 జన జాగృతమొందు జీవి సకలము నీడన్
ఖననము వలదని తెలుపుతు
వనజీవని పేరుగాంచె వన రామయ్యా!
 
కామెంట్‌లు