న్యాయములు-830
"ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహా జనః" న్యాయము
*****
ఏకః అనగాఒక్కడు,ఒంటరి,స్థిరమైనది,మారనిది, సాటిలేనిది.పాపాని అనగా పాపము లేదా చెడు.కురుతే అనగా చేయు,నిర్వహిస్తాడు,ఏదైనా పనిని చేయడం.ఫలం అనగా పండు,పంట, ప్రయోజనము, కార్యము, లక్ష్యము,సంతతి,కత్తివాదర.భుంక్తే అనగా ఆనందిస్తాడు,అనుభవిస్తాడు.మహా జన అనగా గొప్ప వ్యక్తి లేదా మహాత్ముడు, గొప్ప వ్యక్తులు, సాధారణ ప్రజలను కూడా ఈ పదం సూచిస్తుంది (శివ పురాణము).
"ఒకడు పాపము చేసిన సంఘమున కంతకును తత్ఫలము సంభవించును" అంటే ఒక్కడు చేసిన పాపము లేదా చెడుపనుల ఫలితము సంఘం మొత్తం అనభవించవలసి వస్తుంది "అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి సంబంధించిన అర్థం స్ఫురించేలా ప్రజాకవి వేమన ఎంత చక్కని పద్యం రాశారో చూడండి...
కులములోన నొకడు గుణహీనుడుండిన/ కులము చెడును వాని గుణము వలన/ వెలయు జెఱకు నందు వెన్ను వెడలి నట్లు/విశ్వధాభిరామ! వినురవేమ!"
చెఱకులో వెన్ను వెడలడం అంటే వెన్ను పుట్టడం చెరకు గడ ముదిరిన తర్వాత చివర తెల్లగా కంకి వలె వచ్చే పూలు. దీనిని వెన్ను అంటారు.ఇది చెరుకు గడలో ఉన్న తీపిని తగ్గిస్తుంది. అలాగే కులములో ఒకడు గుణ హీనుడు అంటే చెడ్డవాడు/ దుర్మార్గుడు పుట్టినట్లయితే ఆ ఒక్కని దుర్మార్గం, దుష్టత్వం వల్ల అతడి వంశం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది .అనగా వారి కుల సంఘాలు కూడా ఆ ఫలితాన్ని అనుభవించ వలసి వస్తుంది.
దగ్గర దగ్గరగా ఇదే అర్థంతో సుమతీ శతక కర్త బద్దెన కూడా ఓ పద్యం రాశారు..అది కూడా చూద్దాం.
"కొరగాని కొడుకు పుట్టిన/ గొఱగామియెగాడు తండ్రి గుణముల జెఱచున్/ చెఱకు తుద వెన్ను పుట్టిన/ జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ!"
అనగా ఓ బుద్ధిమంతుడా! చెరకుగడ యొక్క చివరన వెన్ను పుడితే అది చెరకు గడ తీపిని నాశనం చేస్తుంది.అదే విధంగా ఒక పనికి రాని కొడుకు తండ్రి యొక్క ప్రతిష్టని నాశనం చేస్తాడు అని అర్థము.
ఈ విధంగా పై రెండు పద్యాలను నిశితంగా పరిశీలించి చూస్తే మనకు తెలిసేది ఏమిటంటే ... కుటుంబంలో గానీ, వంశంలో గానీ చెడ్డవాడు/ దుర్మార్గుడు పుట్టినట్లయితే లేదా ఉన్నట్లయితే .. అతడు చేసే దుష్కర్మల ఫలితము అందరూ అనుభవించవలసి వస్తుంది .
కాబట్టి అలాంటి మనస్తత్వాన్ని బాల్యంలో మొదటి నుంచే గమనించి చెడు నుండి మంచి వైపు మళ్ళించాలి.లేకపోతే కుటుంబం,వంశం, సమాజము మొత్తంగా దుష్ఫలితాలను అనుభవించ వలసి వస్తుంది.
అందుకే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు వహించాలి. వారికి చిన్నప్పటి నుంచే మంచి బుద్ధులు, మంచి అలవాట్లు నేర్పాలి. ఇదండీ! "ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః న్యాయము" లోని అంతరార్థము.ఇది గ్రహించి మనం మన పిల్లల్ని సన్మార్గంలో నడిపించే బాధ్యత మనదే.
వురిమళ్ల సునంద, ఖమ్మంసునంద భాషితం ✍️

సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి