మొగిలి పొద:- ఎడ్ల లక్ష్మి
మోట గొట్టె బావి కాడ 
మొగిలి చెట్టు ఉన్నది 
దాని పొదలో ఒకటి 
బుస్ బుస్ మంటుంది!!

బారెడు పొద్దు ఎక్కింది
బాబురావు వచ్చాడు 
చెట్టు వాసన పీల్చాడు
భద్రంగా అటు వెళ్ళాడు !!

చెట్టుకు ఉన్నా ఆపాము 
మెల్లిగా పైకి చూసింది 
పారుకుంటూ వచ్చింది 
పడిగే తీసి ఆడింది !!

పాము ఆట చూశాడు 
చిన్నగా ఇంటికెళ్ళాడు 
పాలు కొన్ని తెచ్చాడు 
పాముకతడు పోశాడు !!

పాలు తాగి ఆపాము 
పరవశించి పోయింది 
పార్వతి ఒడిలో చేరింది 
అతడికి వరం లిచ్చింది !!


కామెంట్‌లు