జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు మరో సన్మానం స్వీకరించారు. కవి సమ్మేళనానికి ఎంపికైన తన స్వీయ గీతాలను ఆలపించి ఈ ఘన సన్మానం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా, జిల్లా కేంద్రం పార్వతీపురంలో గల సూర్య పీఠం సమావేశ మందిరంలో సాహితీ లహరి, మంచిపల్లి సేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన మంచిపల్లి సత్యవతి స్మారక పురస్కారాల వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనంలో భారతసామ్రాజ్యాలపై తిరుమలరావు స్వీయ గీతాన్ని ఆలపించి అందరి అభినందనలు పొందారు. ఢిల్లీలో ఎర్రకోటను శుభమల్లే కట్టీ భరతావని కంచుకోటగా జెండా నిలబెట్టీ అంటూ, మతసహనం పాటించిన సామ్రాజ్య విస్తరణకు కృషి చేసిన అక్బర్ అంటూ ఆలపించి సభను రంజింపజేసారు.
తిరుమలరావును సాహితీ లహరి వ్యవస్థాపక అధ్యక్షులు డా.మంచిపల్లి శ్రీరాములు, గుర్రంజాషువా పురస్కార గ్రహీత గంటేడ గౌరునాయుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు నారంశెట్టి ఉమామహేశ్వరరావు, బెలగాం భీమేశ్వర రావు, బ్రహ్మశ్రీ వేమకోటి నరహరి శాస్త్రి, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాహితీవేత్తలు ఆకెళ్ళ వెంకట లక్ష్మి, డా.అమరావది నీరజ, గుంటూరుకు చెందిన ప్రముఖ సాహితీవేత్త డా.దార్ల బుజ్జిబాబు, పార్వతీపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్తలు బెహరా ఉమామహేశ్వరరావు, కిలపర్తి దాలినాయుడు, మహ్మద్ రఫీ ఈవేమన తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ డివిజి శంకరరావు, పక్కి రవీంద్రనాథ్, పల్ల పరిశినాయుడు, భోగెల ఉమామహేశ్వరరావు ఉమాకవి, డా.ముట్నూరు ఉపేంద్ర శర్మ, చింతా అప్పలనాయుడు, మీసాల చినగౌరునాయుడు, బివి పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి