చిక్కింది లడ్డు: - డా. వసుంధర-చెన్నై
 చిక్కింది నా సెల్
చేతిలో 
టీ.వి సీరియల్స్ లడ్డు.
 ఇక నాకులేదు
అడ్డు.
   చెప్పెద, నోరు విప్పెద,  టీ.వి.రామాయణం గొప్ప, తప్పెట వాయించి మరీ
చెప్పేదనండీ!
ప్రస్తుతం కుటుంబాల్లో భార్యాభర్త ఓ బిడ్డ 
అదే కుటుంబం అంటే 
మరి సీరియల్స్ లో మాత్రం 
టీవీ పెట్టగానే మొదటి రూమ్ లో నుండి నలుగురు, రెండో రూమ్ లో నుండి ఐదుగురు, మూడో రూమ్ లో నుండి ముగ్గురు చక్కగా మేకప్ చేసుకుని హాల్లోకి వచ్చి నిలబడడం మనం చూస్తాం.
ఏం చక్కటి ఉమ్మడి కుటుంబమండి!
 అలా అనుకొంటే పప్పులో కాలేసినట్టేనండోయ్.
 
ఉమ్మడికుటుంబం మటుకు ఒ కే.
అందులో చివరి వరసలో గుమ్మడి కాయలాంటి
ఓ మగువ 
గుడ్డురుమి చూస్తున్నది, అక్కడ నుండే కధ ప్రారంభం. 
ఇక ఆగదు 60 సంవత్సరాలు అయినా ఆ సీరియల్. 
 కథమాత్రం
కదలదు మెదలదు, టీ.వి.ని వదలదు.
 
 పావం మా బామ్మ
తన యుక్త వయసులో
ప్రారంభమైన సీరియల్ 
తన 90 ఏటికైనా ముగిసిపోతుందేమో పవమాన సుతుడు బట్టు..... అని పాడాలని గంపెడాశతో
చూచి చూచి పాడకుండానే కన్ను మూసింది.
ఇలా చెప్తుంటే కవిత నవలై సాగిపోయే
ప్రమాదముంది
ఇంతటితో ఆపుతాను 
నా చివరి కోరిక.  మనుషులవలే సిరియల్స్ కు శతమానం భవతి అన్న దీవెన వద్దు
  మూడు సంవత్సరాలలోపలగానైనా
 ముచ్చటగా ముగింపు పాడిస్తామని
ప్రభుత్వాలు అభయ హస్తం  చూపించాలి.
 
మరో కొత్తసీరియల్ చూచే భాగ్యం,పాత సీరియల్ని మరిచిపోలేని గొప్ప సందేశం
అమాయకపు ప్రజలు కలిగించాలి. ఇదే ఇదే నా విన్నపం
  శుభం భూయాత్.

కామెంట్‌లు