రామ కళ్యాణం:డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 అందాల రాముడి మెడలో జానకి వరమాల,
శివధనుర్భంగం చేసిన శ్రీరాముడితో సీత పరిణయం.
జగమెల్లా నిండెను సంతోషం.
పరాక్రమమే పరిచయమై,
ఋషుల,గురువుల ఆశీస్సులు
తోడై,
రాజుల,మహరాజుల కరతాళధ్వనుల మధ్య,
దేవతలందరూ పూలవర్షం కురిపిస్తుండగా,
కన్నుల పండుగగా స్వయంవరమైనది.
భూజాత పులకించిపోగా,
మర్యాద పురుషోత్తముడు 
మూర్తీభవించగా,
శివధనువే కాణియై నిలువగా,
పాణిగ్రహణమే జరిగినది.
జనకుని కళ్ళలో సంతోషం,
నీలమేఘశ్యాముని వదనాన ప్రసన్నం,
స్మితవదనయైన సీత సింగారం,
ముడిపడినది ముహూర్తం.
మిథిల పులకించగా,
అయోధ్య తరలిరాగ,
కుదిరెను చూపులు కలిసిన శుభవేళ.
దివి,భువి ఏకమై పాడెను
సీతారాముల కళ్యాణపు పాట.
రాములోరి కళ్యాణం రసరమ్యం‌.
ముస్తాబైనది లోకమంతా నిలువెల్లా.
ఆదర్శమైనది ఏకపత్నీవ్రతం.
వరించిన వరుడి సన్నిధి,
ఇహ,పర లోకాలకు పెన్నిధి.
కామెంట్‌లు