న్యాయములు -832
"ఏకం సంధిత్సతో పరం ప్రత్యవతే"న్యాయము
****
ఏకం అనగా ఒకటి లేక ఒకే.సంధిత అనగా సంఘం లేదా సంబంధం.తతో అనగా అప్పుడు లేదా తర్వాత . పరం అనగా అత్యున్నతమైనది, ఉత్తమమైనది. ప్రత్యవతే అనగా నష్టపోవడం లేదా కోల్పోవడం అనే అర్థాలు ఉన్నాయి.
"ఒకటి చేయవలె అనుకుంటే మరొకటి అయినట్లు"."తానొకటి తలిస్తే దైవమొకటీ తలుస్తాడు".ఉదాహరణకు వేద వాక్యముల నుండి పరబ్రహ్మమును సాధించడానికి ఆరంభించి తుదకు వైష్ణవములోనికో, శైవము లోనికో దిగినట్లు"అనగా.*అనుకున్నది జరగకుండా అనుకోనిది జరిగినట్లు.
నిత్య జీవితంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. తప్పని సరిగా జరుగుతాయి అనకున్నవేమో జరుగవు.ఊహించనివేమో జరుగుతూ ఉంటాయి. అందుకే "తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది" అంటారు.
ఈ న్యాయమును రెండు కోణాల్లో చూడాలి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడంటే అది మన మంచికే కావచ్చు అని కూడా అనుకోవచ్చు.
ఏదో కొండంత శ్రమ చేస్తే చివరికి ఏమి దక్కకుండా పోవచ్చు.చేసిన కష్టం వృధా కావొచ్చుుౌ.
దీనిలో ముఖ్యంగా మనం తలిచింది కాకుండా దైవం ఎందుకు వేరుగా తలుస్తాడో చూద్దాం.
దీనికి సంబంధించిన ఓ చక్కని పద్యం ప్రజాకవి వేమన రాశారు. "లోభ మోహములను ప్రాభవములు తప్పు/ తలచిన పనులెల్ల తప్పి చనుచు/తానొకటి దలచిన దైవమొండగుచుండు/ విశ్వదాభిరామ వినురవేమ!"
అనగా లోభము , మోహము ఉండేవారికి గొప్పతనం ఉండదు.అటువంటి వారు తలచిన పనులు జరుగవు.అందుకే వాళ్ళు తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు . అదే వారు అనుకుంటూ ఉంటారు.
మనందరికీ తెలిసిందే చంద్రహాసుడి కథ. చంద్రహాసుడికి విషము నిచ్చి చంపమని అతనికి తెలియకుండా అతని చేతికే ఓ లేఖ ఇచ్చి పంపుతాడు దుష్ట బుద్ధి. చంద్రహాసుడికి ఇదంతా ఏమీ తెలియదు. దానిని ఇవ్వడానికి దుష్ట బుద్ధి రాజ్యానికి వెళ్తూ ఆ ఊరి సరిహద్దుల్లో గల ఉద్యానవనంలో అలసట వల్ల ఓ చెట్టు నీడన విశ్రమిస్తాడు.
ఆ వ్యాహ్యాళికి వచ్చిన దుష్ట బుద్ధి కూతురు చంద్రహాసుడిని, అతని చెంతనే లేఖ ఉన్న సంచీని చూస్తుంది.అందులో ఏముందో చదువుదామని చూస్తే అందులో ఇతనికి "విషమునిమ్ము" అని వుంటుంది. ఇది తన తండ్రి దుష్ట బుద్ధితో చేసిన పనేనని గ్రహించి కంటి కాటుక తీసి 'ము' 'య'గా మార్చి ఆ సంచీని యథాతథంగా పెట్టి వెళుతుంది.
అది తీసుకుని దుష్ట బుద్ధి కొడుక్కి ఇస్తాడు. అందులో విషయని ఇవ్వమని రాసి ఉండడంతో వెంటనే సోదరిని ఆ చంద్రహాసునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఇందులో దుష్ట బుద్ధి స్వభావం దుష్టమైనది కాబట్టే అతడు అనుకున్నది జరుగలేదు.
ఇక కొందరు అమాయకంగా అనుకున్నది కాకపోయినా వేరేది అంతకంటే మంచిది జరుగుతుంది.
ఇద్దరు సోదరులు ఉంటారు.అందులో ఒకడు బాగా తెలివైన వాడు. మరొకడు అమాయకుడు. అతని అమాయకత్వం చూసి అతనికి భుక్తికి లోటు లేకుండా ఓ పాత్ర అతడికి అందేలా చేస్తాడు. అతడు భార్య పిల్లలతో సుఖంగా ఉండటం చూసి విషయం అడిగి, తాను ఏమీ రానట్టు ప్రవర్తిస్తే అతడికి తగిన శాస్తి చేస్తాడు.అలా అమాయకుడు అనుకున్నది అది కాకపోయినా మంచి చేస్తాడు.
ఏది ఏమైనా మంచి కోసం చేస్తే కొంచెం అటూ ఇటూగా మంచే జరుగుతుంది ఒకవేళ జరుగక పోయినా బాధ పడవద్దు అంటూ ఆచార్య ఆత్రేయ గారు రాసిన ఓ పాటలో"అనుకున్నామని జరగవు అన్నీ/ అనుకోలేదని ఆగవు కొన్నీ/ జరిగేవన్నీ మంచికనీ / అనుకోవడమే మనిషి పని/ అంటారు."
కాబట్టి "ఏకం సంధిత్సతో పరం ప్రత్యవతే న్యాయము" లోని అంతరార్థము గ్రహించి తదనుగుణంగా జీవితాన్ని గడపాలి.చింత వలదని ఇతరుల మనసు నొప్పించకుండా, ఉన్నంతలో బతుకడమే మనిషిగా మనం చేయవలసింది.
వురిమళ్ల సునంద, ఖమ్మం[10:29 pm, 10/04/2025] Sunanda Vurimalla: సునంద భాషితం✍️
న్యాయాలు -831
శలభ న్యాయము
****
శలభం అనగా మిడుత.
"మిడుత దీపమును ఆర్పివేయును " అనే మాటను "దుష్టుడు మంచి వారికి కీడు చేయును" అనే అర్థంతో పోల్చి మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ముందుగా శలభం గురించి నాలుగు విషయాలు తెలుసుకుందాం.
మిడత అనేది ఒక రకమైన కీటకము.పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది మామూలుగా అయితే ఎవరికీ హాని చేయదు కానీ ఒకోసారి అన్ని మిడతలు కలిసి అనగా మిడతల దండు కలిసి పంటపొలాలను సర్వనాశనం చేస్తాయి.ఆ సమయంలో మిడతలు లక్షల సంఖ్యలో చేరి పంట పొలాలు, చెట్టు చేమలను చేరి ఒక్క క్షణంలో వాటి ఆకులను తినేస్తాయి. అవి దండుగా ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమవుతుంది.
అలాంటి మిడతల రకాల్లో ఒకటైన మిడత దీపాన్ని కూడా ఆర్పాలని చూస్తుంది.అందుకే ఈ మిడతను నీచుడు లేదా దుష్టుడితో పోల్చారు. అగ…
[12:37 pm, 11/04/2025] Vedanta Sury: https://www.molakanews.page/2025/04/blog-post_957.html?m=1
[12:47 pm, 11/04/2025] Sunanda Vurimalla: హృదయపూర్వక ధన్యవాదాలు సర్ 🙏
[10:56 pm, 11/04/2025] Sunanda Vurimalla: 🦜 నమస్తే సర్ శుభ రాత్రి 🦜🦜
✍️సునంద భాషితం ✍️
న్యాయములు -832
"ఏకం సంధిత్సతో పరం ప్రత్యవతే"న్యాయము
****
ఏకం అనగా ఒకటి లేక ఒకే.సంధిత అనగా సంఘం లేదా సంబంధం.తతో అనగా అప్పుడు లేదా తర్వాత . పరం అనగా అత్యున్నతమైనది, ఉత్తమమైనది. ప్రత్యవతే అనగా నష్టపోవడం లేదా కోల్పోవడం అనే అర్థాలు ఉన్నాయి.
"ఒకటి చేయవలె అనుకుంటే మరొకటి అయినట్లు"."తానొకటి తలిస్తే దైవమొకటీ తలుస్తాడు".ఉదాహరణకు వేద వాక్యముల నుండి పరబ్రహ్మమును సాధించడానికి ఆరంభించి తుదకు వైష్ణవములోనికో, శైవము లోనికో దిగినట్లు"అనగా.*అనుకున్నది జరగకుండా అనుకోనిది జరిగినట్లు.
నిత్య జీవితంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. తప్పని సరిగా జరుగుతాయి అనకున్నవేమో జరుగవు.ఊహించనివేమో జరుగుతూ ఉంటాయి. అందుకే "తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది" అంటారు.
ఈ న్యాయమును రెండు కోణాల్లో చూడాలి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడంటే అది మన మంచికే కావచ్చు అని కూడా అనుకోవచ్చు.
ఏదో కొండంత శ్రమ చేస్తే చివరికి ఏమి దక్కకుండా పోవచ్చు.చేసిన కష్టం వృధా కావొచ్చుుౌ.
దీనిలో ముఖ్యంగా మనం తలిచింది కాకుండా దైవం ఎందుకు వేరుగా తలుస్తాడో చూద్దాం.
దీనికి సంబంధించిన ఓ చక్కని పద్యం ప్రజాకవి వేమన రాశారు. "లోభ మోహములను ప్రాభవములు తప్పు/ తలచిన పనులెల్ల తప్పి చనుచు/తానొకటి దలచిన దైవమొండగుచుండు/ విశ్వదాభిరామ వినురవేమ!"
అనగా లోభము , మోహము ఉండేవారికి గొప్పతనం ఉండదు.అటువంటి వారు తలచిన పనులు జరుగవు.అందుకే వాళ్ళు తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు . అదే వారు అనుకుంటూ ఉంటారు.
మనందరికీ తెలిసిందే చంద్రహాసుడి కథ. చంద్రహాసుడికి విషము నిచ్చి చంపమని అతనికి తెలియకుండా అతని చేతికే ఓ లేఖ ఇచ్చి పంపుతాడు దుష్ట బుద్ధి. చంద్రహాసుడికి ఇదంతా ఏమీ తెలియదు. దానిని ఇవ్వడానికి దుష్ట బుద్ధి రాజ్యానికి వెళ్తూ ఆ ఊరి సరిహద్దుల్లో గల ఉద్యానవనంలో అలసట వల్ల ఓ చెట్టు నీడన విశ్రమిస్తాడు.
ఆ వ్యాహ్యాళికి వచ్చిన దుష్ట బుద్ధి కూతురు చంద్రహాసుడిని, అతని చెంతనే లేఖ ఉన్న సంచీని చూస్తుంది.అందులో ఏముందో చదువుదామని చూస్తే అందులో ఇతనికి "విషమునిమ్ము" అని వుంటుంది. ఇది తన తండ్రి దుష్ట బుద్ధితో చేసిన పనేనని గ్రహించి కంటి కాటుక తీసి 'ము' 'య'గా మార్చి ఆ సంచీని యథాతథంగా పెట్టి వెళుతుంది.
అది తీసుకుని దుష్ట బుద్ధి కొడుక్కి ఇస్తాడు. అందులో విషయని ఇవ్వమని రాసి ఉండడంతో వెంటనే సోదరిని ఆ చంద్రహాసునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఇందులో దుష్ట బుద్ధి స్వభావం దుష్టమైనది కాబట్టే అతడు అనుకున్నది జరుగలేదు.
ఇక కొందరు అమాయకంగా అనుకున్నది కాకపోయినా వేరేది అంతకంటే మంచిది జరుగుతుంది.
ఇద్దరు సోదరులు ఉంటారు.అందులో ఒకడు బాగా తెలివైన వాడు. మరొకడు అమాయకుడు. అతని అమాయకత్వం చూసి అతనికి భుక్తికి లోటు లేకుండా ఓ పాత్ర అతడికి అందేలా చేస్తాడు. అతడు భార్య పిల్లలతో సుఖంగా ఉండటం చూసి విషయం అడిగి, తాను ఏమీ రానట్టు ప్రవర్తిస్తే అతడికి తగిన శాస్తి చేస్తాడు.అలా అమాయకుడు అనుకున్నది అది కాకపోయినా మంచి చేస్తాడు.
ఏది ఏమైనా మంచి కోసం చేస్తే కొంచెం అటూ ఇటూగా మంచే జరుగుతుంది ఒకవేళ జరుగక పోయినా బాధ పడవద్దు అంటూ ఆచార్య ఆత్రేయ గారు రాసిన ఓ పాటలో"అనుకున్నామని జరగవు అన్నీ/ అనుకోలేదని ఆగవు కొన్నీ/ జరిగేవన్నీ మంచికనీ / అనుకోవడమే మనిషి పని/ అంటారు."
కాబట్టి "ఏకం సంధిత్సతో పరం ప్రత్యవతే న్యాయము" లోని అంతరార్థము గ్రహించి తదనుగుణంగా జీవితాన్ని గడపాలి.చింత వలదని ఇతరుల మనసు నొప్పించకుండా, ఉన్నంతలో బతుకడమే మనిషిగా మనం చేయవలసింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి