కవితలపుస్తకం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవితాపుస్తకం కొనితెచ్చుకొమ్ము
హస్తాభరణం అనిచేతపట్టుకొమ్ము
కవితాపుస్తకం బహుమధురము
కవిహృదయం చాలాఘనము

కవితాపుస్తకం తెరువు
కమ్మనికవిత్వం క్రోలు
కవితాపుస్తకం చదువు
కవిహృదయం ఎరుగు

కవితాపుస్తకం పొరుగువారికిపంచు
పాఠకులహృదయం తట్టిమురిపించు
కవితాపుస్తకము ముద్రణకుసహకరించు
కవివర్యులకు ప్రోత్సాహమునందించు

కవితాపుస్తకం మూలపెట్టకు
ఆలోచనలకు అడ్డుకట్టవేయకు
కవితాపుస్తకం విసిరేయకు
విషయాలను విస్మరించకు

కవితాపుస్తకం పుటలుతిప్పు
కవిగారికష్టం గుర్తించు
కవితాపుస్తకము కాపాడు
భావితరముకు భద్రపరచు

కవితాపుస్తకం అమూల్యం
అజరామరం అస్వాదనీయం
కవితాపుస్తకం కవిమస్తకం
కమనీయం కడురమణీయం


కామెంట్‌లు