శ్రీ శంకరాచార్య విరచిత -మనీషా పంచకం :- కొప్పరపు తాయారు

శ్లోకం: బ్రహ్మై వాహ మిదం జగఛ్ఛ సకలం చిన్మాత్ర _విస్పారితం 
సర్వం ఛైతద విద్యాయా
తృతీయా!!మాయాకల్పితమ్.
ఇత్థంయస్య ధృఢా మతి సుఖ తరే
నిత్యేపరే నిర్మలే 
చణ్డాలోయస్తు సతు ద్విజ గురు రిత్యేష మనీషా మమ్ !!2!!

భావం: నేను స్వచ్ఛమైన చైతన్యాన్ని మరియు ఈ విశ్వం మొత్తం స్వచ్ఛమైన చైతన్యం యొక్క విస్తరణ మాత్రమే !
           ఈ మాయ నుండి మనం చూసే ఈ త్రిగుణాలతో  తయారు చేయబడినది, ఊహ ద్వారా సృష్టించబడింది. 
         ఎవరి బుద్ధి చెండాలుడైన, బ్రాహ్మణుడైనా,
శర్వానందకరమైన, శాశ్వతమైన, పరమ సత్యంలో, దృఢంగా స్థిరపడిందో. 
         అతను నిజంగా గురువుగా ఉండడానికి అర్హుడు, ఇది నా దృఢ విశ్వాసము.
                     ____

కామెంట్‌లు