అదే జ్ఞానం:- జగదీశ్ యామిజాల
 జెన్ గురువుని చూసేందుకు ఒకరొచ్చారు.
"మనం మనమెప్పుడైనా చూసుకున్నామా" అని అడిగారు గురువుగారు.
"అవును" అన్నాడాయన.
’"అలాగా?...అయితే రండి టీ తాగుదాం" అని తీసుకెళ్ళారు గురువుగారు.
తర్వాత మరొకరొచ్చారు.
అతనితో "మనమెప్పుడైనా కలుసుకున్నామా" అని అడిగారు గురువుగారు.
ఆయన లేదన్నాడు.
వెంటనే గురువుగారు "అలాగా? అయితే టీ తాగుదాం రండి" అన్నారు.
ఈ చిన్ని కథ చెప్పే తత్వం...
మన జీవితంలో కలిసే మనుషులనూ, మనకు కలిగే అనుభవాలనూ సమానంగా భావించడమే జ్ఞానం.

కామెంట్‌లు