మత్తకోకిల
బావి బోరుల నీటి బొట్టును పట్టి పైరుల పోయగా
రేవులందున మళ్ళతింపిన లీలలందున పంటలౌ
చావు దెబ్బగ రాత్రిపూటన చల్లనీ వడగండ్లతో
తావులేకను వడ్లు రాలగ తల్లడిల్లెను రైతులూ!
============================
కంద పద్యం
వడగండ్లు పడిన చోటున
కడగండ్లు మిగులును రైతు కంటన నీరై
జడవంగను వానలలో
తడవంగను కంటనీరు తనువున నిండున్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి