తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని కె.ఉషారాణికి బహుమతి
 మాచిరాజు బాల సాహిత్య పీఠం,హైదరాబాదు వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పాఠశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన కథల పోటీలలో లింగాల ఘణపురం మండల కేంద్రములోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని కె.ఉషారాణి 9వ.తరగతి చిన్న వయసులో గొప్ప తెలివి అనే కథకు ప్రోత్సాహక బహుమతిని గెలుచుకున్నది. 300 రూపాయల నగదు బహుమతితో పాటు,జ్ఞాపిక, ప్రశంసా పత్రం, చందమామ కథల పుస్తకం అందజేస్తారు.జూన్ నెల హైదరాబాదులో నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులను అందజేస్తామని మాచిరాజు బాల సాహిత్య పీఠం అధ్యక్షులు మాచిరాజు కామేశ్వరరావు గారు తెలియజేశారు.ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానాచార్యులు శ్రీమతి జి సునీత,  ఉపాధ్యాయులు అభినందించారు.

కామెంట్‌లు