బుల్లి పిట్ట వచ్చింది
మెళ్లే కన్నుతో చూసింది
తల్లి ఒడిలో చేరింది
చల్లగా సేద తీరింది
వేటగాడు వచ్చాడు
తల్లిని పిల్లను చూశాడు
ఎగిరి గెంతులు వేశాడు
ఎంతో మురిసిపోయాడు
బాణమెక్కి పెట్టాడు
చిట్టి పిట్ట చూసింది
కంట్లో రెట్ట వేసింది
బాణం గురి తప్పింది
కళ్ళు మూతలు పడ్డాయి
పిట్టలు లేచి వెళ్ళాయి
కళ్ళు తెరిచి చూశాడు
లబోదిబోమని ఏడ్చాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి