సాకి:-
ఓ శ్రామిక సోదరా.....
. అమూల్య మైన నీ శ్రమకు వెల కట్ట లేమురా !
పల్లవి :-
నీ కండలు కరిగించి, నెత్తురునే చెమట చేసి...
రాయి రప్పలతో, కొండలు, గుట్టలతో దుర్గమమగు ప్రదేశాలు, నందన వనములుజేసి...
అందమైన రహదారులు, ఆకాశ హర్మ్యాలతో దివినే భువిగా మార్చిన అపర మయ బ్రహ్మ లయా మీరు!
జోహార్లు...! మీకు జోహార్లు...!!
" నీకండలుకరిగించి "
చరణం:-
నీ శ్రమ తోనే ఈ జగతికి సుఖము,సౌఖ్య0
నీ శ్రమయే ఈ సమాజ ప్రగతికి మూలం...2
కార్మికునిగ, కర్షకునిగ, వివిధ రంగాలలో సేవల నందించే శ్రామికులుగా...2
అంకిత భావంతో పనిచేసే... మీరే వంద నీయులు ...మీరే వందనీయులు...!
" నీకండలుకరిగించి "
చరణం:-
మొదట సుఖ, భోగాలను అనుభవించగ
నిజమగు అర్హులు మీరే...,
మీరు కూడు, గుడ్డ, గూడు లేక అలమటించు టన్యాయం...!
పోరాడైనా హక్కులు సాధించాలి... సుఖ, సౌ ఖ్యాలతొ ఆనందముగా అందరు జీవించాలీ...! 3
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి